ఆర్ ఆర్ ఆర్ పై రాజమౌళి న్యూ ప్లాన్ !

Seetha Sailaja
‘ఆర్ ఆర్ ఆర్’ సాగతీ ప్రేక్షకుడుని పూర్తిగా సంతృప్తి పరచలేకపోయినా ఈమూవీ కలక్షన్స్ మటుకు దుమ్ము రేపుతున్నాయి. ఇప్పటికీ మెట్రో అర్బన్ ఏరియాలలో ఈమూవీ కలక్షన్స్ సంతృప్తి కరంగా ఉన్నాయి. అయితే కొంతమేరకు రూరల్ ఏరియాలలో ఈమూవీ కలక్షన్స్ కొంతవరకు డ్రాప్ అవ్వడంతో ఈమూవీ బయ్యర్లు కలవరు పడుతున్నారు అన్నవార్తలు వస్తున్నాయి.


ఈపరిస్థితుల నేపద్యంలో ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ కలక్షన్స్ అర్బన్ మెట్రో ఏరియాలలో ఏమాత్రం పడిపోకుండా మరింత పుంజుకోవడానికి రాజమౌళి రచించిన న్యూ ప్లాన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీని కొన్ని నగరాలలో 3D ఫార్మేట్ లో కూడ విడుదల చేసారు. ఈ 3D ఫార్మేట్ కు ముంబాయి ఢిల్లీ లాంటి నగరాలలో మంచి స్పందన వచ్చింది.


అయితే తెలుగు రాష్ట్రాలలో కానీ దక్షిణాది రాష్ట్రాలలోని ప్రధాన నగరాలలో ‘ఆర్ ఆర్ ఆర్’  3D వెర్షన్ విడుదల కాలేదు. ఇప్పుడు అతి త్వరలో మన తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలలో కూడ ‘ఆర్ ఆర్ ఆర్’ 3D వెర్షన్ సందడి చేయబోతోంది. ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలై 10 రోజులు అవుతూ ఉండటంతో ఈమూవీకి సంబంధించిన పెంచిన టిక్కెట్ రెట్లు తగ్గించవలసి ఉంది. దీనితో ఈమూవీని అత్యంత భారీ రేట్లకు కొనుక్కున్న తెలుగు రాష్ట్రాలలోని బయ్యర్లకు కొంత కలవరపాటు ఏర్పడినట్లుగా రాజమౌళి దృష్టికి వచ్చినట్లు సమాచారం.


తన మూవీ బయ్యర్లకు ఏర్పడిన ఈ కలవరపాటుకు పరిష్కారంగా జక్కన్న ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించిన 3D ఫార్మేట్ ప్రింట్స్ ను తెలుగు రాష్ట్రాలలోని ముఖ్యనగారాలలో విడుదల చేసి అలా విడుదల చేయడం ద్వారా 3D ఫార్మేట్ లో ‘ఆర్ ఆర్ ఆర్’ ను ప్రేక్షకులను చూడమని గట్టిగా ప్రమోట్ చేసే ఆలోచనలలో ఉన్నారట. తెలుగు రాష్ట్రాలలో లక్షల సంఖ్యలో చరణ్ జూనియర్ లకు వీరాభిమానులు ఉన్నారు కాబట్టి వారంతా మళ్ళీ ధియేటర్లకు వచ్చి 3D ఫార్మేట్ లో ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాను చూస్తే కలక్షన్స్ పరంగా ‘ఆర్ ఆర్ ఆర్’ కు ఇక ఎటువంటి సమస్య ఉండదని రాజమౌళి మాష్టర్ ప్లాన్ అంటున్నారు..




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: