అమరావతి : తెలుగు ప్రజలకు సీఎంల ఉగాది గిఫ్ట్

Vijaya



తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రులిద్దరు కూడబలుక్కున్నట్లుగా ఉగాది గిఫ్ట్ అందించారు. సరిగ్గా ఉగాది పండుగకు ముందు విద్యుత్ ఛార్జీలు పెంచారు. పండుగలనేవి మనకు సెంటిమెంటుతో కూడుకున్నవి. ఏదైనా మంచిపని చేయాలంటు మంచిరోజులను చూసుకుంటాం. అలాగే మంచిపని చేయటానికి ముహూర్తాలు చూసుకోవటం అందరికీ అనుభవమే. అమావస్య, యమగండం, రాహుకాలం లాంటి సమయాల్లో అసలు ఏపనీ తలపెట్టం.



ఇక పండుగల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమేలేదు. అందులోను తెలుగు ప్రజలకు ఉగాది అనేది చాలా ప్రాముఖ్యత గలిగిన పండుగ. ఎందుకంటే తెలుగు ప్రజలకు ఉగాది పండుగే కొత్త సంవత్సరాది. ఇన్ని విశిష్టతలు కలిగున్న ఉగాది పండుగ ముందు ముఖ్యమంత్రులు కేసీయార్, జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలను పెంచేసి జనాల సెంటిమెంటి మీద దెబ్బకొట్టారు. సరిగ్గా పండుగ ముందు ఛార్జీలను పెంచేసి బాదొదిలిపెట్టారు. గతంలో ముఖ్యమంత్రులు ఛార్జీలను పెంచేటపుడు పండగలు లాంటివాటిని గుర్తు పెట్టుకునే వారు. కానీ వీళ్ళిద్దరు అసలలాంటి సింటెమెంటును లెక్క చేసినట్లే అనిపించటంలేదు. అందుకనే పండుగ ముందు బాదుడే బాదుడు.



పండుగల, వాటి ప్రాముఖ్యతలను తెలిసి కూడా ముఖ్యమంత్రులు జనాలను ఉగాది ముందు ఎందుకు ఇబ్బంది పెట్టారో అర్ధం కావటంలేదు. పెంచే ఛార్జీలేవో ఉగాది అయిపోయిన రెండు రోజుల తర్వాత కూడా పెంచవచ్చు. నిజానికి పండుగకు ఛార్జీల బాదుడికి ఎలాంటి సంబంధంలేదనే చెప్పాలి. కానీ పండుగ ముందు ఈ ఛార్జీలను పెంచటం ఏమిటనే సెంటిమెంటు జనాల్లో పెరిగిపోతోంది. పండుగ ముందు, పండుగ రోజు అంతా మంచే జరగాలని, మంచి వార్తలే వినాలని జనాలు కోరుకుంటారు.



ఈ విషయాలు తెలిసీ ముఖ్యమంత్రులు ఛార్జీలను పెంచేసి జనాలను బాదటం మొదలుపెట్టడమే సెంటిమెంటుగా చూస్తున్నారు. దేశంలో అన్నీ వస్తువుల ధరలు పెరుగుతునే ఉన్నాయి. మన పాలకుల పుణ్యమాని నిత్యావసర వస్తువుల ధరలు పెరగటమే కానీ తగ్గటమనేదుండదు. ధరల పెంపుకు ఎలాగూ అలవాటు పడిపోయాం. కానీ అదేదో పండుగ తర్వాత పెంచితే బాగుండేది కదాని జనాలు అనుకుంటున్నారంతే.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: