మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు.. ఇక మా వల్ల కాదంటున్న సామాన్యులు?
ఇలాంటి సమయంలో పెట్రోల్ ధరలు పెరిగి పోతూ ఉండటం మాత్రం ఇక సామాన్యుల నడ్డి విరుస్తుంది అని చెప్పాలి. దీంతో వాహనం బయటకు తీయాలని భయపడిపోతున్నారు సామాన్యులు. మార్చి 22వ తేదీ నుంచి వరుసగా నేటి వరకు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దాదాపు తొమ్మిది రోజులు పెట్రోల్ ధరలు క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయని చెప్పాలి. ఇప్పటికే పెరిగిన ధరలతో లీటర్ పెట్రోల్ ధర 115 రూపాయలు దాటింది. డీజిల్ ధర వంద రూపాయల మార్కును క్రాస్ చేసింది ఇక ఇప్పుడు ఈ రోజు కూడా పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. దీంతో ఇక పెట్రో భారం అటు సామాన్యుడిపై గుదిబండలా మారిన పోతుంది అని చెప్పాలి.
నేడు పెట్రోల్ డీజిల్ పై దాదాపు 80 పైసలు చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయాయి. నేడు హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర లీటర్ కి 115.46 రూపాయలకు చేరింది. డీజిల్ ధర 101.56 రూపాయలకు చేరింది. ఇక ఇలా పెట్రోల్ ధరలు పెరిగిపోవడం మాత్రం సామాన్యులను కూడా బెంబేలెత్తిస్తోంది. ఇక ఇంతలా పెట్రోల్ ధరలు పెరిగి పోతే ఆ భారాన్ని భరించడం మా వల్ల కాదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో ఒకటి చేసి పెట్రోల్ ధరలు తగ్గించి సామాన్య ప్రజలు అయినా మాకు విముక్తి కలిగించాలని అంటూ కోరుతున్నారు ఎంతో మంది జనాలు..