క్యాబ్ డ్రైవర్ కొత్త ఆలోచన.. మనుషులతో పాటు వాటికి కూడా సర్వీస్?

praveen
ప్రస్తుతం ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ సర్వీస్ లు అందుబాటులోకి వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు సొంత వాహనాల్లో వెళ్లడం లేదా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం లాంటి సదుపాయాలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో ఒక్క క్లిక్ చేస్తే చాలు అడుగు దూరంలో వచ్చి సర్వీస్ అందించేందుకు ఓలా, ఉబర్ లాంటి ఎన్నో క్యాబ్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నగరాలు పట్టణాలలో ఉన్న వారందరూ కూడా ఇలాంటి సర్వీసులను ఎక్కువగా వినియోగించుకుంటూ ఉన్నారు. అయితే సాధారణంగా ఇలాంటి క్యాబ్ సర్వీసుల్లో పెంపుడు జంతువులను అస్సలు అనుమతించరు.



 దీంతో ఎంతో మంది పెంపుడు జంతువుల యజమానులు కాస్త అసౌకర్యంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ఈ విషయాన్ని గమనించిన టాక్సీ డ్రైవర్ అమర్జిత్ సింగ్ సరికొత్త ఆలోచన చేసాడు. ఫ్రెండ్లీ పేట్ సర్వీస్ లను అందిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశాడు. ఇక ఈ సరికొత్త ఆలోచనకు అటు నెటిజన్ల నుంచి కూడా విశేషమైన స్పందన వస్తూ ఉండడం గమనార్హం. దీంతో అమర్జీత్ సింగ్ కాస్త ప్రస్తుతం ఇంటర్నెట్లో సంచలనం గా మారిపోయాడు. టాక్సీ డ్రైవర్ అమర్జీత్ సింగ్ ఢిల్లీలో టాక్సీ నడుపుతూ ఉంటాడు. టాక్సీ లో ప్రయాణించే కస్టమర్ తో ఇట్టే తెలిసిపోతూ ఉంటాడు.


 ఈ క్రమంలోనే ఇక క్యాబ్ లో అటు పెంపుడు జంతువులను అనుమతించక పోవడం వల్ల కస్టమర్లు ఇబ్బందులు పడుతున్నారు అన్న విషయం తెలుసుకున్నాడు. ఇలా క్యాబ్ ఓనర్స్ నో పెట్ విధానాన్ని అనుసరిస్తూ ఉండటం వల్ల ఇబ్బంది పడుతున్నారని తెలిసి సరికొత్త ఆలోచన చేశాడు. కరోనా వైరస్ కారణంగా దెబ్బతిన్న గిరాకీని మళ్లీ పుంజుకునేలా చేయాలంటే ఏదో కొత్తగా చేయాలని భావించాడు. ఈ క్రమంలోనే పెట్ టాక్సీ సర్వీస్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోగా ఢిల్లీ ఎన్సీఆర్ లో నివసిస్తున్న పెట్ ఓనర్ నుంచి అతనికి ఎన్నో కాల్స్ వచ్చాయి. సర్వీసులు వినియోగించుకుంటున్న ఎంతోమంది తమ పెంపుడు కుక్కలను ఆస్పత్రులు, గ్రూమింగ్ సెంటర్స్  తదితర ప్రాంతాలకు ఎంతో సులభంగా తీసుకెళ్ల గలుగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Cab

సంబంధిత వార్తలు: