ఇకపై వాహనాలపై ఆ స్టికర్ లు ఉంటే జరిమానా ?

VAMSI
వాహనదారులకు షాక్ మీద షాక్ ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇకపై వాహనాలపై హోదాను తెలియబరచే ఎటువంటి స్టిక్కర్ లను వేసుకుని హల్చల్ చేస్తే ఊరుకునేది లేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు అక్కడి పోలీసు అధికారులు. వాహనాలపై ఛైర్మన్, పోలీస్, అడ్వకేట్, ఆర్మీ, ప్రెస్, జిహెచ్ఎంసి కార్పొరేటర్, డిఫెన్స్ అంటూ ఇలా స్టిక్కర్లు ఉండకూడదని సూచించారు. ఒకవేళ అటువంటి స్తిక్కర్లతో రోడ్లపై వాహనాలు కనుక కనపడితే జరిమానా విధిస్తామని సదరు పోలీసు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎటువంటి హోదాను అడ్డు పెట్టుకుని నిబందనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా వాహనాలపై తిరుగుతూ కనిపిస్తే చర్యలు తప్పక తీసుకుంటామని తగిన శిక్ష పడుతుందని పేర్కొన్నారు.
మంగళవారం నాడు సిటీలోని నారాయణ గూడాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు ప్రజలకు ఈ అంశం పై అవగాహన పెంచేలా చేశారు. అంతే కాకుండా స్టిక్కర్లు ఉన్న వాహనాలను నిలిపి వాటిని తొలగించి విషయాన్ని తెలియచేసి ఎవరైనా సరే నిబంధనలకు అనుగుణంగానే నడుచుకోవాలని తెలియచేశారు. నిబందలను అతిక్రమిస్తే ఎవరైనా సరే చర్యలు తీసుకోబడతాయని అన్నారు. ఇటీవలే టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కార్ ను సైతం ఆపి తనిఖీలు చేసి కార్ కు ఉన్న బ్లాక్ స్క్రీన్ ను తొలగించిన విషయం తెలిసిందే. అదే రోజు మరి కొందరి రాజకీయ నాయకుల కార్ లను సైతం చెక్ చేసి బ్లాక్ స్క్రీన్ లను తొలగించారు.
ఈ మధ్య పోలీసు శాఖ దూకుడు పెంచింది, ఎంతటి వారైనా సరే చట్టం ముందు సమానమే అన్నట్లుగా వ్యవహరిస్తోంది.  ప్రభుత్వం సైతం పోలీసులకు అండగా నిలబడుతూ , ఆదేశాలను జారి చేస్తోంది. దీనిని బట్టి చూస్తుంటే ఇక మీదట దొంగ స్టిక్కర్ లతో తిరిగే ఆకతాయిల ఆటలు సాగవని అర్ధమవుతోంది. కాబట్టి ప్రజలందరూ పోలీసు వారు సూచించిన వాటిని గౌరవించి వారికి సహకరించవలెను.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: