చైనా సరిహద్దుల్లో భారత్ కొత్త ప్లాన్.. 600 మంది సైనికులతో?
ఇప్పటికి కూడా సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికులు కంటి మీద కునుకు లేకుండా గస్తి చేస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాదు ఏ క్షణం లో ఎలాంటి సంఘటనలు సరిహద్దుల్లో సంభవిస్తాయో అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. సరిహద్దుల్లో పరిస్థితులు కాస్త సద్దుమణుగుతున్నాయి అనుకునేలోపే చైనా ఏదో ఒక విధంగా తోక జాడిస్తూ ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తూనే ఉంది. అదే సమయంలో భారత సైన్యం కూడా సరిహద్దుల్లో ఎంతో దూకుడుగా వ్యవహరిస్తూ చైనాకు దీటుగానే బదులిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలోనే ఇక చైనా సరిహద్దుల్లో భారత్ సరికొత్త ప్లాన్ అమలు చేసేందుకు సిద్ధమైంది అనేది తెలుస్తుంది.
చైనా సరిహద్దుల్లో భారత సైన్యం భారీగా సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. సిలీగుడి ప్రాంతంలో నిర్వహించిన కసరత్తులో భాగంగా 600 మంది సైనికులు పాల్గొనడం గమనార్హం. ఇక ఇందులో భాగంగా పారాషూట్ ల ద్వారా సైనికులు విమానాల నుంచి దూకడం ఇక శత్రువుల సరిహద్దులు దాటి వెళ్లి కీలక ప్రాంతాలను ఆక్రమించడం వంటి విన్యాసాలు చేశారు భారత సైనికులు. ఇలా సైనికులు వారి విన్యాసాలు చేసిన సిలీగుడి ప్రాంతం నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ సరిహద్దులు కలిగిన ప్రాంతం కావడం గమనార్హం. ఇక సరిహద్దుల్లో ఇది చాలా వ్యూహాత్మకమైన ప్రాంతంగా కూడా రక్షణ రంగ నిపుణులు చెబుతుంటారు..