బాబోయ్.. అరాచకం: జంతువుల కొవ్వుతో నూనెలు?

Chakravarthi Kalyan
జంతువులు కొవ్వులతో నూనెలు చేసి.. వాటిని చిల్లర విక్రయిస్తున్న వ్యవహారం కర్నూలలు జిల్లాలో కలకలం రేపుతోంది. కొందరు మాంసం వ్యాపారులు.. జంతువుల కొవ్వును కరగబెట్టి వంట నూనెలు తయారు చేస్తూ.. వాటిని మార్కెట్లో విక్రయిస్తున్నారు. రోడ్డు పక్కన ఉండే హోటళ్లకు, టిఫిన్ సెంటర్లకు, ఈ నూనెలు అమ్ముతున్నారు. ఆ హోటళ్లు, టిఫిన్ సెంటర్‌ వాళ్లు ఈ నూనె వాడుతూ  ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. నంద్యాల కేంద్రంగా ఈ కల్తీ నూనె దందా భారీగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేకించి బిర్యానీ పాయింట్లు, చికెన్‌ పకోడి బండ్లు, కబాబ్‌ స్టాల్స్‌ వద్ద ఈ నూనె అమ్మకం జరుగుతున్నట్టు తెలుస్తోంది.



జంతువుల కొవ్వు, మాంసం దుకాణాల్లో మిగిలే కొవ్వుతో ఈ నూనెలు తయారు చేస్తున్నారట. ఈ వ్యర్థాలను అతి తక్కువ ధరలకు సేకరిస్తారు. ప్రత్యేక కేంద్రాల్లో వాటిని రహస్యంగా నూనెలుగా మారుస్తారు. ఆ తర్వాత ఆ నూనెను  ఖాళీ టిన్నుల్లో నింపి ఈ స్టాళ్లకు చేరవేస్తున్నారు. ప్రత్యేకించి
నంద్యాలలోని నందమూరి నగర్‌ శివారులో ఓ రేకుల షెడ్డులో ఈ వ్యాపారం జరుగుతున్నట్టు తెలుస్తోంది. అక్కడే ఇతర రాష్ట్రాల నుంచి రప్పించిన కూలీలతో రేకుల షెడ్డుల్లో ఈ నూనె తయారీ వ్యవహారం నడిపిస్తున్నారు.


ఈ నూనె తయారీ కోసం అర్థరాత్రి వేళల్లో పశువధ కూడా చేపడుతున్నట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. మరోవైపు ఈ కల్తీ నూనెలు వాడితే ఆరోగ్యం మటాష్ అంటున్నారు వైద్యులు. కల్తీ నూనెలు వాడితే వాటి వ్యర్థాలు ఊపిరితిత్తుల్లో పేరుకుపోతాయట. ఈ కల్తీ నూనెల కారణంగా పచ్చ కామెర్లు వచ్చే ప్రమాదం ఉందట. వాటి వల్ల లివర్‌ చెడిపోయే ప్రమాదం వస్తుందట. అలాగే పశు కొవ్వులతో తయారు చేసిన నూనెల వల్ల క్యాన్సర్‌ కూడా వస్తుందట. అలాగే చెడు కొవ్వు ఎక్కువైతే గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని.. నిపుణులు హెచ్చరిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: