ప్రపంచ నీటి దినోత్సవం: చెట్లను నాటి నీటి వనరులను పెంచండి?

VAMSI
ఈ ఫాస్ట్ జనరేషన్ లో జలవనరులు రోజురోజుకు అంతరించి పోతున్న సంగతి తెలిసిందే. నీటిని తెలిసి తెలిసి వృదా చేసేస్తున్నాం. మన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకుంటే భవిష్యత్తులో నీటి ముప్పు తప్పదు, తాగు నీటి కొరత తప్పదు . నీటిని వృథా చేయకూడదు అని నేర్చుకోవడంతో సరిపెట్టడం కాదు, ఖచ్చితంగా పాటించాల్సిన సమయం ఇది. అందుబాటులో ఉన్న నీటి వనరులను సరిగా వినియోగించుకుని కాపాడుకోకపోతే మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. సమస్య మరింత జఠిలం కాకుండా జాగ్రత్త పడాలి. అందుబాటులో ఉన్నటటువంటి జల వనరుల్లో నీటిని సరిగా వినియోగించకుండా వృదా చేస్తున్నాం.

నీటిని ఇలానే వృదా చేస్తూ పోతే 2050 నాటికి ప్రపంచంలో జనాలకు కావలసినంత తాగు నీరు దొరకదని, ప్రజలు స్నానాలు చేయడం మానేసి శరీరానికి రసాయన లేపనాలు పూసుకుని సరిపెట్టుకుంటారు అని, తలస్నానానికి నీరు దొరక్క గుండ్లు చేయించుకోవాల్సి వస్తుందని,  సరిహద్దుల్లో ఉండాల్సిన సైన్యం కాస్త నీటి వనరుల చుట్టూ కాపలా ఉంటుందని’ అని ఒకానొక సందర్భంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం అన్నారు. ఇపుడు పరిస్థితులను నిశితంగా గమనిస్తే ఆయన చెప్పింది నిజంగా జరుగుతుందేమో అనిపిస్తోంది, అయిన 2050 ఎంతో దూరం లేదు. ఇప్పుడే దాదాపుగా 220 కోట్ల మందికి పైగా ప్రజలకు సురక్షితమైన నీరు అందటం లేదు.

ఇప్పటికైనా సరైన జాగ్రత్తలు తీసుకుని సంరక్షించుకోకపోతే విపత్తు తప్పదు. ముందుగా చెట్లను పెంచడంలో మీ వంతు పాత్రను పోషించింది. ఎక్కువగా చెట్లను పెంచండి. నీటిని వాడిన వెంటనే కొళాయిలను కట్టేయండి. టాయిలెట్లు పగిలి పోతే నిర్లక్ష్యంగా వదిలేయకుండా రిపేర్ చేయించి, నీరు లీక్ అవకుండా  చూసుకోవాలి.  నిత్య అవసరాలకు నీటిని వాడే సమయంలో అవసరానికి మించి నీటిని వాడి వృదా చేయకండి. అయితే మనము వృధా చేయకుండా నీటి వనరులను పెంచుకునే పద్దతులను పాటించాలి. ఇంటికి ఒక చెట్టును నాటితే, ఊరంతా చెట్లు మయం అయ్యి  వరుసలు కురవడానికి ఆధారం అవుతుంది. తద్వారా భూమిలో జలాలు పెరుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: