ఎన్నికలు "హాయ్ హాయ్".. వరాల జల్లే కురిసే..!

MOHAN BABU
శాసనసభ సాక్షిగా సీఎం కేసీఆర్ అన్ని సెక్షన్ ల వారికి వరాలు ప్రకటించారు. గతంలో పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు కానప్పటికీ సమ్మెకు వెళ్లారని ఆగ్రహించిన ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగాల నుంచి తొలగించి, మళ్లీ తీసుకుంటామని, ఏళ్ల తరబడి పెండింగ్ l ఉన్న సమస్యలను సైతం పరిష్కరిస్తామని సీఎం ప్రకటన చేయడంతో ఇది ముందస్తు ఎన్నికలకు సూచన అని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గుసగుసలాడుతున్నారు. ఎన్నికల కోసమే వరాలని టీఆర్ఎస్ శ్రేణులు సైతం అభిప్రాయపడుతున్నారు.


 టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు ఎన్నిక మేనిఫెస్టోలో పెట్టినవి కొన్ని పరిష్కారం కాగా కొన్ని నిధులు లేక నిలిచిపోయాయి. మరికొన్ని అసలే ప్రారంభం కాలేదు. అయితే అసెంబ్లీ చివరి రోజున పార్టీ అధినేత సీఎం కేసీఆర్ అందరికీ వరాల జల్లు కురిపించారు.ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మెప్మా, సెర్మ్ ఉద్యోగులకు వేతనాలు ఇస్తామని ప్రకటన చేశారు. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ లను వెనక్కి తీసుకోవడం,మధ్యాహ్న భోజన కార్మికులకు 1000 రూపాయల నుంచి 3 వేల వరకు వేతనం పెంపు, పిఆర్ ఏ లను ఇరిగేషన్ లష్కర్లు గా ప్రమోషన్స్,111 జీవో రద్దు, దేవాలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు, సాదా బైనామాలు, నోటరైజ్డ్ డాక్యుమెంట్ల క్రమబద్ధీకరణ, కళాశాలలు, డిగ్రీ కళాశాలల నిర్మాణం, ధరణి సమస్యల పరిష్కారం,700కు పైగా ఉక్రెయిన్ విద్యార్థులకు మెడికల్ విద్య, ఉస్మానియా ఆస్పత్రి పునర్నిర్మాణం, అకాల వర్షాలకు పంట నష్టపోయిన పత్తి రైతులకు పరిహారం, ఈ నెల 31 వరకు 40 వేల కుటుంబాలకు దళిత బంధు, పోడు భూముల సమస్యకు పరిష్కారం,మెడికల్ కళాశాలలో నర్సింగ్ కళాశాలలకు అనుమతి, హెల్త్ యూనివర్సిటీలో పారామెడికల్ కోర్సులు,  మైనార్టీ విద్యార్థులకు పెండింగ్ రియంబర్స్మెంట్ విడుదల తదితర హామీలను ఇచ్చారు. బడ్జెట్లో సైతం డబుల్ బెడ్రూం లతోపాటు ఇళ్ల స్థలాలు ఉన్నవారికి మూడు లక్షలు ఇస్తామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ హామీల వరాలు ప్రకటించడంతో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాల బాటపట్టారు. అసెంబ్లీ లో ప్రభుత్వం ఇచ్చిన హామీలు,చేసిన ప్రకటనలు, నిధులు విడుదల,చేసిన అభివృద్ధిని వివరించే పనిలో పడ్డారు. ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరుపై నివేదిక తెప్పించుకున్నా కెసిఆర్.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు వారిపై నిఘా పెట్టనున్నట్లు సమాచారం.


దీంతో ఎమ్మెల్యేలు నియోజకవర్గం అంతా కలియతిరిగారని ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. గతంలో జరిగిన అభివృద్ధి టిఆర్ఎస్ వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని వివరించే పనిలో నిమగ్నమయ్యారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మెప్మా, సెర్మ్, ఫీల్డ్ అసిస్టెంట్లతో పాటు మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పెంపు సైతం తమకు కలిసి వచ్చే అవకాశం అని, వీటిని మరింత ప్రచారం చేసి మరోసారి విజయం సాధించాలని ఎమ్మెల్యేలు సైతం భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: