ఉక్రెయిన్ కు అమెరికా పరోక్ష సహకారం..!
ఇక నాటో దేశాలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. రష్యా దాడుల కారణంగా తమ గగనతలం మూసివేయాలని జెలెన్ స్కీ అనేక సార్లు నాటోను కోరినా అందుకు సుముఖత చూపలేదు. ప్రపంచంలో అత్యంత బలమైన నాటో కూటమిలోని కొంతమంది సభ్యులు రష్యా దూకుడుతో హిప్నటైజ్ అయ్యారు అని జెలెన్ స్కీ విమర్శించారు. నో ఫ్లై జోన్ గా ప్రకటించకపోవడంతో ఉక్రెయిన్ నగరాలపై రష్యా విరుచుకుపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక రష్యాకు చైనా సహకారంపై ఆమెరికా సీరియస్ అయింది. రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ కు ఆయుధాలు అందిస్తామని అమెరికా ప్రకటించింది. అలాగే ఆర్థిక, ఆహార, మానవతా సాయం చేస్తామని అధ్యక్షుడు బైడెన్ చెప్పారు. ఉక్రెయిన్ శరణార్థులను అమెరికాలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. రష్యాకు చైనా ఆయుధాలు ఇచ్చి సహకరిస్తుందనే వార్తలపై స్పందించిన బైడెన్.. ఆంక్షలకు వ్యతిరేకంగా సాయం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. రష్యాకు సాయంపై చైనా స్పష్టత ఇవ్వాలన్నారు.
మరోవైపు ఉక్రెయిన్ పై యుద్ధంతో రష్యాపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధిస్తున్నా.. అధ్యక్షుడు పుతిన్ వెనక్కు తగ్గడం లేదు. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, ఈయూ.. రష్యా నుంచి ముడి చమురు దిగుమతిపై నిషేధం విధించాయి. తాజాగా అమెరికాకు పుతిన్ రివర్స్ కౌంటరిచ్చారు. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, హిల్లరీ క్లింటన్, కెనడా ప్రధాని జస్టిస్ ట్రుడో సహా మొత్తం 12మంది అగ్రనేతలు రష్యాలో ప్రవేశించకుండా పుతిన్ ఆంక్షలు విధించారు.
ఇక తనతో పోరాడేందుకు సిద్ధమా అంటూ టెస్లా.. స్పేస్ ఎక్స్ సీఈఏ ఎలన్ మస్క్.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు సోషల్ మీడియా వేదికగా ఛాలెంజ్ విసిరారు. తనతో పోరాడేందుకు పుతిన్ కు సవాల్ విసురుతున్నా.. ఈ పోరులో గెలిచిన వారే ఉక్రెయిన్-రష్యా యుద్ధం కొనసాగాలా.. ఆగిపోవాలా.. నిర్ణయిస్తారు అని అన్నారు. అందులో భాగంగా రష్యా అధ్యక్ష భవానాన్ని ట్యాగ్ చేశారు. ఉక్రెయిన్లకు స్టార్ లింక్ శాటిలైట్ సేవలతో మస్క్ బాసటగా నిలిచారు.