ఉక్రెయిన్ యుద్ధం: రష్యాకు ఎదురుదెబ్బ... ఆర్మీ మేజర్ మృతి?
ఇపుడు తాజాగా మరో రష్యా మేజర్ జనరల్ యుద్ద భూమిలో మరణించినట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే రష్యా కు చెందిన ఆర్మీ అధికారులు ముగ్గురు మరణించగా ఇపుడు నాలుగవ అధికారి మరణించడంతో రష్యా చింతిస్తున్నట్లు తెలుస్తోంది. యుద్ధం వద్దని శాంతి చర్చలతో సమస్యను సామరస్యంగా పరిష్కారించుకుందామని ఉక్రెయిన్ చెబుతున్నా వినకుండా, ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవడం ప్రధాన లక్ష్యంగా పావులు కదుపుతూ భయంకర యుద్దాన్ని చేస్తున్న రష్యా పై యుక్రెయిన్ యుద్ధం చేయక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ దాడుల్లో రష్యా సైనికులు మరియు ముగ్గురు మేజర్ జనరల్స్ మృత్యువాత పడినట్లు తెలుస్తోంది.
ఇపుడు మరో రష్యన్ మేజర్ జనరల్ ఒలేగ్ మిత్యేవ్ దాడుల్లో మరణించినట్లు యుక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. రష్యా మేజర్ జనరల్ ఒలేగ్ మిత్యేవ్ 150వ మోటరైజ్డ్ రైఫిల్ డివిజన్లో కీలక పాత్ర పోషించారు అదే విధంగా ఉక్రెయిన్ పై యుద్ధం లోనూ టీం ను లీడ్ చేస్తున్నారు. కాగా ఆయన యుద్ద భూమిలో మరణించినట్లు ఉక్రెయిన్ స్థానిక మీడియా ప్రకటించింది. మరి రష్యా ఇపుడు ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.