హిజాబ్ వివాదంపై హై కోర్ట్ సంచలన తీర్పు.
అయితే దేశంలోని ఏ కోర్ట్ కూడా ఈ విషయంపై చర్చించడానికి పిటిషన్ లను స్వీకరించలేదు. కర్ణాటక హై కోర్ట్ మాత్రమే ఈ విషయంపై తుది నిర్ణయాన్ని ప్రకటించాలి అని స్పష్టం చేశాయి. దానితో కర్ణాటక హై కోర్టు ఇచ్చే తీర్పు కోసం ముస్లిం లు మరియు ఇతర మతాల వారు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే దానిపై ఈ రోజు కాసేపటి క్రితమే కర్ణాటక హై కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. ఈ తీర్పులో హై కోర్ట్ చాలా క్లియర్ గా స్కూల్స్ మరియు కాలేజ్ లలో విద్యార్థినులు మతానికి సబందించిన హిజాబ్ ను ధరించడం తప్పని సరి కాదు అని వెల్లడించింది. ఈ తీర్పును వెల్లడించింది వారిలో రితూ రాజ్ అవస్తో చీఫ్ జస్టిస్ కాగా, కృష్ణ దీక్షిత్, జే ఎస్ ఖాన్ ఖాజీ లు జస్తిక్ లుగా ఉన్నారు.
అయితే ఈ తీర్పు పట్ల ఎవరైనా ఎటువంటి అవాంచనీయ సంఘటనలకు తెరలేపినా కటినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతే కాకుండా ముందస్తుగా పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరింది. అంతే కాకుండా ఈ తీర్పును ఇచ్చిన న్యాయమూర్తుల ఇంటి దగ్గర కూడా భారీ భద్రతను కల్పించినట్లు తెలిసింది. కర్ణాటక లోని ముఖ్య నగరాలు అన్నింటిలో హై అలెర్ట్ ప్రకటించింది. ఇప్పటికే ఈ తీర్పు నేపథ్యంలో ఈ రోజు విద్యాసంస్థలకు సెలవు ఇవ్వడం జరిగింది.