రష్యా యుద్ధం ఎఫెక్ట్ : దుకాణాలపై అధికారులు దాడులు..

Satvika
రష్యా- ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఆ భీకర యుద్ధం కారణంగా ఎందరో ప్రాణాలును పొగొట్టుకున్నారు.. ఆర్థిక నష్టం తో పాటుగా ప్రాణ నష్టం కూడా జరిగింది. రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్ దాదాపు నేల మట్టం అయ్యింది.. అంతేకాదు ప్రధాన వనరుల పై భారీ ప్రభావం పడింది. ముఖ్యంగా వంట నూనెల పై ప్రభావం కాస్త ఎక్కువగానే పడింది.. మొన్నటివరకూ ఓ మాదిరిగా ఉన్న ధరలు నేడు మార్కెట్ లో సామన్యులకు షాక్ ఇస్తున్నాయి.. ఒకేసారి కేజీ పై 30 నుంచి 40 రూపాయలు పెరిగింది.

ఈ రేట్లు ఏమని పెరిగాయో కానీ పాత నూనెల పై కూడా ఈ ధరలను వేసి అమ్ముకుంటూ వస్తున్నారు.. మరి కొన్ని దుకాణ దారులు నూనెలు ఇంకా పెరుగుతాయని నూనెలను నిల్వ వుంచి మరి అమ్ముకుంటూన్నారు. దేశ వ్యాప్థంగా వ్యాపారులు ఇలానే చెస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ లో ఎక్కువగా ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు.. అలాంటి దుకాణాల పై అధికారులు దాడులు నిర్వహించారు. వారి నుంచి భారీగా సరుకును స్వాదీనం చేసుకున్నారు..

విషయాన్నికొస్తే.. ఏపీ లోని కర్నూలు జిల్లాలో పలు దుకాణాల పై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు..నిల్వ ఉంచిన రూ.85 లక్షల విలువైన వంటనూనెను అధికారులు దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచినా, ఎంఆర్‌పి కంటే అధిక ధరలకు విక్రయించినా చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు.. కర్నూలు నగరంలో ని అంబికా ఆయిల్‌ మిల్లులో దాదాపు రూ.50 లక్షల విలువ చేసే 65 టన్నుల నూనెను సీజ్‌ చేయగా, జిల్లాలో ని ఆదోని, బనగాన పల్లె తదితర ప్రాంతాల్లో కూడా కేసులు నమోదు చేశామని తెలిపారు.మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఇలా చేయడం వల్ల ధరలు తగ్గే అవకాశం ఉందని తెలుస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: