విద్యార్థులకు షాక్... "జగనన్న విద్యా దీవెన" వాయిదా?

VAMSI
వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి 2019 సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించి ఏపీ సీఎంగా గద్దెనెక్కిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఇది ఒక సంచలన విజయంగా పేరుగాంచింది. అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సైతం ముప్పతిప్పలు పెట్టి టీడీపీని 20+ సీట్లకు మాత్రమే పరిమితం చేశాడు. అలా అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ప్రజల కోసం నవరత్నాలు అనే సంక్షేమ పథకాలను తీసుకు వచ్చారు. అందులో ఒక పథకమే "జగనన్న విద్యా దీవెన". ఈ పథకం విద్యార్ధుల చదువులకు విద్యాసంస్థలకు ఫీజులను చెల్లించడం కోసం తీసుకు రావడమా జరిగింది.

అయితే ఇంతకు పాద యాత్రలో జగన్ గమనించిన ఒక సమస్యకు పరిష్కారమే ఈ పధకం. దీని వలన ఎందరో పేద విద్యార్థులు లాభ పడుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా జరిగిన విద్యా సంవత్సరం కోసం ప్రభుత్వం ఫీజులను ఇవ్వాల్సి ఉంది. అయితే ఇందు కోసం వాస్తవంగా ఈ రోజున విద్యా దీవెన డబ్బులు తల్లుల ఖాతాలలో వేయాల్సి ఉంది. ఇప్పటికే ఈ విషయం గురించి ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పుడు తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ జగన్నన విద్యా దీవెన ను ఈసారికి వాయిదా వేస్తున్నట్లుగా  చెప్పి విద్యార్థులకు షాక్ ఇచ్చింది. ఈ విషయం తెలిసిన విద్యార్థుల తల్లితండ్రులు కూడా నిరాశకు గురయ్యారు.

కానీ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావడం వలన విజయవాడలో ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం లో ఏర్పాటు చేసిన ఒక ప్రభుత్వ కార్యక్రమానికి అటెండ్ కావాల్సి ఉండడంతో అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. అందుకే ఈ రోజు విద్యా దీవెన  వాయిదా పడింది. అయితే తర్వాత ఎప్పుడూ విద్యా దీవెన అమలు కానుంది అనే విషయం త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని ప్రభుత్వం తెలియచేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: