ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం ?

Veldandi Saikiran

అమరావతి : ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.  ఏపీ అధికార భాషా చట్టం 1966కు సవరణకు ఆమోదం తెలిపింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కేబినెట్.  ఉర్దూను రెండో భాష గా గుర్తిస్తూ చట్ట సవరణ చేస్తూ.. 35 అజెండా అంశాలపై చర్చ జరిపింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కేబినెట్.  విదేశీ మద్యం నియంత్రణ చట్ట సవరణకు ఆమోద ముద్ర వేసింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కేబినెట్.  నిజాం పట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం పై  అంగీకారంతో పాటు..  టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకం కోసం హిందు ధార్మిక సంస్థల చట్ట సవరణకు  ఆమోదం తెలిపింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కేబినెట్.  మచిలీపట్నం,భావనపాడు, రామాయపట్నం పోర్టుల నిర్మాణం కోసం రూ. 8741 కోట్ల రుణ సమీకరణకు ఏపీ మారిటైమ్ బోర్డుకు హామీ ఉండేందుకు ఆమోదం తెలిపింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కేబినెట్.  ఖాయిలా పడిన చక్కెర కర్మాగారాల్లోని ఉద్యోగులకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ అంశానికి కేబినెట్ ఆమోదం తెలిపింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కేబినెట్.


 అలాగే టాలీవుడ్ చలన  చిత్ర పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి అదిరిపోయే శుభవార్త చెప్పినట్లు సమాచారం అందుతోంది.  సినిమా టిక్కెట్ల ధరల పెంచుతూ త్వరలో జీవో జారీ చేయనుంది  జగన్ మోహన్ రెడ్డి  ప్రభుత్వం. జీవో జారీ ప్రక్రియపై తుది కసరత్తు చేసింది జగన్ మోహన్ రెడ్డి  ప్రభుత్వం. ఇవాళ లేదా రేపటిలోగా జీవో జారీ చేయనున్న జగన్ మోహన్ రెడ్డి  ప్రభుత్వం.. వీలైనంత త్వరగా జీవో జారీ చేయాలని సినీ పెద్దల నుంచి ప్రభుత్వానికి రిక్వెస్టులు చేపట్టే అవకాశం కనిపిస్తోంది.  ఇప్పటికే టిక్కెట్ ధరల పెంపుపై  వివిధ స్థాయిల్లో చర్చించిన టిక్కెట్ ధరల నిర్ధారణ కమిటీ వేసింది జగన్ మోహన్ రెడ్డి  ప్రభుత్వం. జీవో 35 ధరలతో పోల్చుకుంటే కొత్త జీవోలో చెప్పుకోదగ్గ స్థాయిలోనే కొత్త ధరల నిర్ధారణ... చేయనుంది జగన్ మోహన్ రెడ్డి  ప్రభుత్వం. గ్రామీణ ప్రాంతాల్లోని థియేటర్లకు ఊరటనిచ్చేలా కొత్త ధరలు తీసుకు వచ్చే దిశగా అడుగులు వేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: