తెలంగాణ బడ్జెట్: విద్యార్థినులకు బంపర్ ఆఫర్... పూర్తి వివరాలివే?
ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ వెంకటేశ్వరస్వామి ఆలయంలో అంతా సవ్యంగా జరిగి రాష్ట్రం పచ్చగా ఉండాలని ఆయన పూజలు కూడా చేశారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇచ్చిన హామీలను దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర అభివృద్ధిని ధ్యేయంగా చేసుకుని, ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండేలా బడ్జెట్ ను తీర్చిదిద్దామని అన్నారు. ఇక ఆయన రాష్ట్ర బడ్జెట్ బాధ్యతలు చేపట్టడం ఇది మూడోసారి కావడం విశేషం. ఇదిలా ఉండగా ఈ సారి గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలను మొదలెట్టేయడంతో కాస్త వార్తల్లో నిలుస్తోంది. అందులోనూ ప్రత్యర్ధి పార్టీలు తమతమ పాయింట్లతో ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఫుల్ హాట్ గా ఉన్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి.
అటు కేసీఆర్ సర్కార్ సైతం అందుకు దీటుగా విశ్లేషణ ఇచ్చి నిర్ణయాలను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. బడ్జెట్ కేటాయింపులు అంశంపై ప్రభుత్వానికి , విపక్షాలకు మద్య పెద్ద సంఘర్షణే జరిగేలా ఉంది అంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.