వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో హరీష్ రావు పర్యటన

Veldandi Saikiran
ఇవాళ తెలంగాణ వైద్య మరియు ఆర్థిక శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో ములుగు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ చేయడమే కాకుండా తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టును అట్టహాసంగా ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. ఇక ఈ ప్రారంభోత్సవం అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ఆసిఫాబాద్ జిల్లా అంటే ఒకప్పుడు ఎలాంటి వైద్య సదుపాయాలు ఉండేవి కావు. వానాకాలం వస్తె డయేరియా, అంటు రోగాలు ఉండేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవన్నారు హరీశ్ రావు.  హైదారాబాద్ పోవాల్సిన అవసరం లేకుండా.. గాంధీ ఉస్మానియా స్థాయి వైద్యం ఇక్కడ అందిస్తామన్నారు హరీశ్ రావు.  మారు మూల ప్రాంతాలకు సైతం వైద్య సేవల కొరత లేకుండా ముఖ్యమంత్రి  చేస్తున్నారు... వైద్యం విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నదని వెల్లడించారు హరీశ్ రావు.  స్థానిక ప్రజా ప్రతినిధుల కోరిక మేరకు కాగజ్ నగర్, ఆసిఫాబాద్ లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు హరీశ్ రావు. 


సింగరేణి ని కేంద్ర ప్రభుత్వం అమ్మాలని చూస్తోంది...  విశాఖ ఉక్కుఅమ్మారు ...ఇప్పుడు సింగరేణి బొగ్గు బ్లాకులను అమ్మకానికి పెట్టింది కేంద్రన్నారు  హరీశ్ రావు.  135 శాతం లాభాల్లో ఉన్న సింగరేణి ని నష్టాలోకి నెట్టి అమ్మే ప్రయత్నం చేస్తుంది.. బొగ్గు బ్లాకుల కేటాయింపు లో గుజరాత్ కో నీతి తెలంగాణ కో నీతా....అని అరహించారు హరీశ్ రావు.   అక్కడి బొగ్గు బ్లాకుల ను  గుజరాత్ సంస్థ కు అప్పిగించారు.. తెలంగాణలో మాత్రం బ్లాకులను వేలం వేస్తారా.. అని నిలదీశారు హరీశ్ రావు.  దేశానికి వెలుగులు నింపే తెలంగాణ సింగరేణి కి బొగ్గు బ్లాక్ లు ఎందుకు కేటాయించరో చెప్పాలని డిమాండ్ చేశారు హరీశ్ రావు.  సింగరేణి కార్మికులకు ఐ టి మినహాయింపు ఇవ్వాలన్నారు హరీశ్ రావు. కొన్ని జిల్లాల్లో ప్రసవం కోసం ప్రభుత్వ ,ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే ఎక్కువగా ఆపరేషన్ చేస్తున్నారు..ఆ పద్ధతి మారాలని చెప్పారు హరీశ్ రావు.  సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని ఆదేశాలు జారీ చేశారు హరీశ్ రావు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: