వారంలో ఒక్కసారైనా అలా చేయండి : సజ్జనార్
అయితే ఇక ఆర్టీసీ ఎండీగా కూడా ఎంతో దూకుడు గానే ముందుకు సాగుతున్నారు సజ్జనార్. ఆర్టీసీ ఎండీగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎక్కడికక్కడ ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు ఉన్నాయి అని తెలుసుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ప్రత్యేక వాహనంలో వెళ్లడమే కాదు అందరూ ప్రయాణించే ఆర్టీసీ బస్సులో వెళితే అసలైన సమస్యలు తెలుస్తాయని భావించి ఇక ప్రస్తుతం ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ప్రయాణీకులతో ముచ్చటిస్తూ ఆర్టీసీలో తీసుకు రావలసిన మార్పుల గురించి తెలుసుకుంటున్నారు.
అంతేకాదు ఆర్టీసీకి మరింత ఆర్థిక చేయూత నిచ్చే విధంగా ప్రతి ఒక్కరు తమ ప్రయాణాలను సాగించాలి అంటూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇటీవలే విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్విట్ చేశారు. రోజువారి పనులు ఇతర అవసరాల నిమిత్తం చేసే ప్రయత్నాల్లో భాగంగా కనీసం వారంలో ఒక్కరోజైనా టిఎస్ఆర్టిసి బస్సులో ప్రయాణం చేయాలని కోరుతూ ఒక ట్విస్ట్ విడుదల చేశారు సజ్జనార్. ప్రజల కోసమే ఈ ప్రజా రవాణా వ్యవస్థ ఉందని వారంలో ఒకరోజు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా ప్రతీ ఒక్కరూ ఎవరికి వారు ప్రతిజ్ఞ తీసుకోవాలని సజ్జనార్ విజ్ఞప్తి చేయడం గమనార్హం.