పోలవరం పై శుభవార్త: భరోసా ఇచ్చిన కేంద్ర మంత్రి!
దాదాపుగా ప్రాజెక్ట్ పూర్తి కావస్తోంది. అయితే దీనిపై విపక్షాల నుండి ప్రభుత్వంపై వచ్చిన విమర్శల నేపథ్యంలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నుండి జలవనరుల శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్ పోలవరం ను సందర్శించారు. అయితే సీఎం జగన్ తో పాటు పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన షెకావత్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇక్కడ పనులు బాగా జరిగాయని, కానీ ఇంకా ముందే పోలవరానికి వచ్చి ఉన్నట్లయితే పూర్తి అయివుంటుందని అభిప్రాయపడ్డారు. గతంలో ఇక్కడకు రావడానికి ప్లాన్ చేశామని అయితే కరోనా కారణంగా కుదరలేదు అని వాపోయారు.
పోలవరం గురించి మాట్లాడుతూ ఇది ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ఎంత ముఖ్యమో తెలిసిందే. ఆనాడు రాష్ట్ర విభజన వేళ కాంగ్రెస్ ప్రభుత్వం పోలవరానికి జాతీయ హోదాను ఇవ్వడం జరిగింది. పోలవరం పునరావాస బాధితులకు ఏపీ బీజేపీ నాయకులు స్వశక్తితో నిలబడేలా చూసుకునే బాధ్యతను అప్పగించారు. అంతే కాకుండా పోలవరం ప్రాజెక్టుకు ఖర్చు అయిన ప్రతి రూపాయి కేంద్రం చూసుకుంటుందని భరోసా ఇచ్చారు. దీనిని బట్టు చూస్తే ఏపీ సీఎం జగన్ పోలవరం విషయంలో కేంద్రాన్ని ఒప్పించడంలో సక్సెస్ అయ్యాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.