మూడు రోజుల్లో 39 కోట్లు.. ట్రాఫిక్ పోలీసులు భలే ఐడియా?

praveen
ఇటీవలి కాలంలో ట్రాఫిక్ పోలీసులు ఎంత అప్రమత్తంగా ఉంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు ఎక్కడో ఒక మూలమలుపున నిలబడి వచ్చి పోయే వాహనాలను తనిఖీలు చేస్తూ ఉండేవారు పోలీసులు. ఈ క్రమంలోనే ఇక ఎంతో మంది వాహనదారులు ట్రాఫిక్ చలాన్లు పడకుండా తప్పించుకునే వారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఆ అవకాశం లేకుండా పోయింది అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఎక్కడ చూసినా ట్రాఫిక్ పోలీసులు కనిపిస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు తనిఖీలు నిర్వహించాల్సినా అవసరం లేకుండా పోయింది. ట్రాఫిక్ పోలీసుల చేతిలో కెమెరా ఉండడంతో ఇక ట్రాఫిక్ పోలీసులు ఎవరైనా రోడ్డు నిబంధనలు ఉల్లంఘించారు అంటే చాలు ఫోటో తీయడం చలనాలు ఇంటికి పంపించడం చేస్తూ ఉన్నారు.



 ఇక ఇటీవల కాలంలో చలాన్లు కూడా భారీగా పెరిగిపోవడంతో ప్రతి ఒక్కరు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పాలి. ఇకపోతే ఇలా ఎంతోమంది చలాన్లు ఉన్నప్పటికీ ఇక వాటిని కట్టకుండా నిర్లక్ష్యం చేసిన వారు చాలా మంది ఉన్నారు.  ఈ క్రమంలోనే వందల కోట్ల పెండింగ్  చలాన్లు అలాగే ఉన్నాయి అని గుర్తించారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఈ క్రమంలోనే వాహనదారులు అందరూ కూడా చలాన్లు కట్టుకునే విధంగా ఎంతో వినూత్నమైన ఆలోచన చేశారు. ఇక పెండింగ్ చలానా కట్టే వారికి రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఎంతోమంది పెండింగ్లో ఉన్న చలాన్లు కట్టుకున్నారు అని చెప్పాలి.


 గత కొన్ని రోజుల నుండి చూసుకుంటే పెండింగ్లో ఉన్న చలాన్ లపై పోలీసులు ప్రకటించిన రాయితీ కి  మంచి స్పందన వస్తుంది అని చెప్పాలి. ఇక తొలి మూడు రోజుల్లోనే ఏకంగా 39 కోట్లు వసూలు అయినట్లు అధికారులు చెప్పారు. మార్చి 1వ తేదీన 8 లక్షలకు.. రెండవ తేదీన 15 లక్షలు మూడవ తేదీన 16 లక్షల చలాన్లు  వాహనదారులు చెల్లించాలంటూ ట్రాఫిక్ అధికారులు తెలిపారు. ఇక ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పాత పద్ధతిలోనే చలాన్లు  విధిస్తాం అంటూ చెబుతున్నారు పోలీసులు. మళ్లీ రాయితీలు ఇస్తారు అనే ఉద్దేశంతో నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: