అమరావతి : వివేకా హత్య జరిన రోజు నుంచే ఒక పధకం ప్రకారం చంద్రబాబు, లోకేషులపై వైసీపీ బురద జల్లుతుందని.. 2019 మార్చిలో ప్రతిపక్ష నేతగా జగన్ సీబీఐ విచారణ చేయాలని కోరారని తెలిపారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ. సీఎం కాగానే సీబీఐ విచారణ అవసరం లేదని కేసు ఉపసంహరించుకున్నది వాస్తవం కాదా..? అన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ. ప్రతిపక్షంలో ఉంటే సీబీఐ కావాలా..? అధికారంలో ఉంటే సీబీఐ విచారణ వద్దా..? హైకోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్ తెచ్చి విచారణ కోరారు కదా..? అని మండిపడ్డారు బోండా ఉమ. 161 స్టేట్మెంట్ చెల్లి సునీత, ఆమె భర్త, జగన్ బంధువులు ఇచ్చారని.. ఈ హత్య చేసింది వాళ్లేనని స్పష్టంగా చెప్పినా వారిని కాపాడటానికి జగన్ ప్రయత్నం చేస్తున్నారని తెలి పారు బోండా ఉమ.కేసులో అసలు నిజాలను సీబీఐ వెలికి తీస్తుంటే జగన్ అడ్డుకున్నది వాస్తవం కాదా..? దోషుల పేర్లు బయటకు రాగానే... సునీత పైనే ఆరోపణలు చేస్తారా..? తండ్రిని కోల్పోయిన కుమార్తెకు న్యాయం చేయమంటే తప్పా..అని ఆగ్రహించారు బోండా ఉమ.
చంద్రబాబు నడిపిస్తున్నారని మాట్లాడటానికి సిగ్గుందా..? ఎన్నికలకు ముందు ఆడిన డ్రామాలనే ఇప్పుడూ కొనసాగిస్తున్నారు... సునీతమ్మే హైకోర్టులో వేసిన పిటిషన్ కారణంగా నేడు అసలు దోషుల పేర్లు బయటకు వచ్చాయన్నారు బోండా ఉమ. సిట్ బృందం దర్యాప్తును కూడా నీరుగార్చేలా చేశారు.... నిందితులను జగన్ కాపాడుతున్నారని అందరికీ అర్ధమైంది... సునీతమ్మ అందుకే న్యాయ పోరాటం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బోండా ఉమ. అవినాష్ రెడ్డి, గంగిరెడ్డి, శివశంకర రెడ్డి పేర్లు కూడా సునీత ప్రస్తావించారు...వివేకా హత్య జరిగే సమయానికి ఎంపీ అభ్యర్థు లు ప్రకటన కూడా రాలేదన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడుటీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ.