రిస్క్ తీసుకున్న పేర్ని?
తాము ఎవరి మీద కక్ష సాధించడం లేదని..సినిమా బాగుంటే ఎవరైనా ఆదరిస్తారని ప్రభుత్వం చెబుతుంది... అయితే ఇక్కడ రెండువైపులా రాజకీయం కనిపిస్తుందనే చెప్పాలి..సినిమా టిక్కెట్ల విషయంలో వైసీపీ ప్రభుత్వం కావాలనే జోక్యం చేసుకుందని చెప్పాలి..అసలు పక్క రాష్ట్రం తెలంగాణలోనే ఏ సమస్య లేనప్పుడు ఏపీలో ఈ సమస్య ఎందుకు వచ్చిందో ప్రజలకు అర్ధమవుతుంది..అలాగే ఎక్కువ షోలకు పక్క రాష్ట్రంలో అనుమతించారు...కానీ ఏపీలో ఇవ్వలేదు..ఎక్కువ షోలకు అనుమతి ఇస్తే ఎవరికి నష్టం ఉండదు...కాకపోతే పవన్ కల్యాణ్ సినిమా పరోక్షంగా నష్టపోవాలనే వైసీపీ ప్రభుత్వం ఇలా చేసిందనే చెప్పాలి.
అటు జనసేన, పవన్ అభిమానులు సైతం రాజకీయం చేసినట్లే కనిపిస్తున్నారు...ఎక్కువ షోలకు అనుమతి ఇవ్వకపోతే పెద్ద రచ్చ చేయాల్సిన అవసరం కూడలేదు..సినిమా చూడలేని వారు...తర్వాత రోజు చూస్తారు..ఇక పనిలో పనిగా టీడీపీ కూడా దీన్ని రాజకీయం చేసేసింది..ఏదో జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతో పవన్‌ని అడ్డం పెట్టుకున్నారు..అలాగే పవన్ మద్ధతు కూడా దక్కుతుందనే కోణం టీడీపీకి ఉంది.
ఇక టోటల్‌గా రాజకీయంలో కొంతమంది అనవసరంగా రిస్క్ తీసుకున్నారని చెప్పొచ్చు..అసలు ఒక సినిమా కోసం చంద్రబాబు స్పందించాల్సిన అవసరం లేదు..అదే సమయంలో మంత్రి పేర్ని నాని కూడా తమ వైపు తప్పేం లేదన్నట్లు చెప్పుకొచ్చారు..కానీ ఏం జరిగిందో అందరూ చూశారు..అంత ఎందుకు పేర్ని ప్రాతినిధ్యం వహిస్తున్న మచిలీపట్నంలో భీమ్లానాయక్ సినిమాకు చెక్ పెట్టడానికి మంత్రి ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారో..వాటి గురించి అక్కడ ప్రజలు మాట్లాడుకునే పరిస్తితి ఉంది. ఇలా అనవసరంగా జోక్యం చేసుకుని పేర్ని..తన ఇమేజ్‌ని నెగిటివ్ చేసుకున్నారనే చెప్పాలి.