ఢిల్లీలో హై అలెర్ట్... 144 సెక్షన్
అయితే యుద్దానికి కన్నా ముందే భారతదేశం ముందు జాగ్రత్త చర్యగా భారతీయ పౌరులను ప్రత్యేక విమానం ద్వారా కొంతమంది వరకు స్వదేశానికి వచ్చేలా చేసింది. అయితే ఇంకా అక్కడ విద్యార్థులు మిగిలిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యుద్ధ తీవ్రస్థాయికి చేరుకుంటున్న పరిస్థితులలో అక్కడ ఉన్న విద్యార్థులతో సహా, ఇండియాలో ఉన్న విద్యార్థుల తల్లితండ్రులు తీవ్ర ఆందోళన పడుతున్నారు. ఇందుకోసం ఢిల్లీ లోని రష్యా ఎంబసీ వద్ద ఎవరో గుర్తు తెలియని సంస్థ ఈ ధర్నాకు మొదటి అడుగు వేసినట్లు తెలుస్తోంది. వెంటనే ఉక్రెయిన్ పై చేస్తున్న యుద్దాన్ని ఆపాలని వీరు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ప్రక్రియతో రష్యన్ ఎంబసి వద్ద కట్టు దిట్టమైన భద్రతతో పాటుగా 144 సెక్షన్ పెట్టారు. కానీ ఢిల్లీ పోలీసులు నిరసన తెలుపుతున్న వారిని అక్కడి నుండి పంపేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంకా ఉక్రెయిన్ లో ఉన్న 16 వేల మంది భారతీయుల గురించి వారి బంధువులు మరియు తల్లితండ్రులు బాధపడుతున్నారు. మరి ఈ విషయం ఎక్కడకు దరి తీస్తుందో అర్ధసం కానీ పరిస్థితి. ఉక్రెయిన్ లో ఉన్న భారతీయుల విషయంలో మోదీ నెక్స్ట్ స్టెప్ ఏంటి?