రష్యా- ఉక్రేయిన్ యుద్ధం.. భారత్ ఏమందంటే?
ఇకపోతే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన అంశం ఒక్కటే.అదే ఉక్రెయిన్ రష్యా సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన. ప్రస్తుతం రష్యా సరిహద్దుల్లో తీవ్ర స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యం లో ఏ క్షణం లో ఏం జరుగుతుందో అనే విధంగా మారిపోయింది పరిస్థితి. రష్యా వెనక్కి తగ్గాము అని చెబుతున్నప్పటికీ ఏ క్షణం లో నైనా రష్యా యుద్ధం చేసే అవకాశం ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయ్. అదే సమయం లో ఉక్రెయిన్ కి మద్దతుగా యూరోపియన్ యూనియన్ నాటో దేశాలు రావడం తో రష్య ఉక్రెయిన్ యుద్దాం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు.
ఇలాంటి సమయం లో సరిహద్దుల్లో నెలకొన్న వివాదాలను శాంతి యుతంగా పరిష్కరించుకోవాలి అంటూ గతం లో స్పందించిన భారత్ తటస్థం గానే వ్యవహరించింది. ఇక ఇప్పుడు మరో సారి భారత్ ఉక్రెయిన్ రష్యా సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒకవైపు రష్యా మరోవైపు ఉక్రెయిన్ రెండు దేశాలు కూడా తమ సైన్యాన్ని ఉపసంహరించు కోవాలని.. అలా అయితేనే శాంతి యుతం గా సమస్యను పరిష్కరించుకోవడం సాధ్యమవుతుందని భారత్ తెలిపింది. అన్ని దేశాల భద్రత వ్యవహారాన్ని కూడా రష్యా ఉక్రెయిన్ పరిగణలోకి తీసుకోవాలంటూ భారత్ చెప్పింది.