మల్లన్నసాగర్ లో నీళ్లు.. ఈ ప్రాజెక్ట్ లో ఉరితాళ్లు..!

MOHAN BABU
ఎన్నో ఏళ్ల నుంచి భూమిని భుక్తిని నమ్ముకొని తమ సర్వస్వం అయినా వ్యవసాయాన్ని ప్రాజెక్టు నిర్మాణం కోసం దానం చేసి, కొంతమంది మేము భూమి కోల్పోతే లక్షల ఎకరాలకు నీరు వస్తుందని ఒక రైతన్న బాధను ఈ నిర్వాసిత రైతన్నలు అర్థం చేసుకొని ప్రాజెక్టు నిర్మాణానికి తమ భూములను ఇచ్చారు. ఇక్కడ ప్రభుత్వం వారికి అందించే  పరిహారం కనీసం వారికి ఇల్లు కట్టుకోడానికి కూడా సరిపోలేదు. ఇంకా మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే వినూత్న నిరసన చేపట్టారు. మరి అది ఎక్కడో తెలుసుకుందామా..!

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు వద్ద భూ నిర్వాసితులు బుధవారం  వినూత్న నిరసన చేపట్టారు. రెండు నెలలుగా తమకు పరిహారం ఇవ్వాలంటూ ప్రాజెక్ట్ వద్ద దీక్ష చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ మెడకు ఉరి తాడు బిగించుకొని గుడాటిపల్లి గ్రామ భూనిర్వాసితులు వినూత్నంగా నిరసన తెలిపారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కంటే ముందే ప్రారంభమైన గౌరవెల్లి ప్రాజెక్ట్ ముంపులో భూములు కోల్పోతున్న తమకు నష్టపరిహారం ఇవ్వాలని రెండు నెలలుగా ప్రాజెక్టు వద్ద దీక్ష చేస్తున్న ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని భూ నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేశారు.


 2007 లో నిర్మాణ పనులు ప్రారంభమైన గౌరవెల్లి ప్రాజెక్ట్ ను 2014లో కుర్చీ వేసుకొని పూర్తి చేస్తానన్న సీఎం కెసిఆర్, గౌరవెల్లి ప్రాజెక్టు తర్వాత 2016 లో నిర్మాణం ప్రారంభించిన మల్లన్నసాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ, అనంతగిరి ప్రాజెక్టులను పూర్తిచేసి జాతికి అంకితం చేయడం గౌరవెల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఏది ఏమైనా తమకు పూర్తి నష్టపరిహారం వచ్చే వరకు నిరసనను కొనసాగిస్తామని భూ నిర్వాసితులు తెలిపారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ నిర్వాసితుల రైతులను  ఆదుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: