మేధాపాట్కర్ సంచలన వ్యాఖ్యలు..!
ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. భవిష్యత్తులో మరో మహమ్మారి ప్రపంచంపై విరుచుకుపడే అవకాశముందని మైక్రో సాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ హెచ్చరించారు. కొత్త విపత్తు కోవిడ్ కుటుంబం నుంచి కాకుండా వేరే వైరస్ ల నుంచి వచ్చే అవకాశముందని తెలిపారు. వృద్ధులు, ఒబెసిటీ, డయాబెటిస్ వ్యాధిగ్రస్తులపై ఈ మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉండొచ్చన్నారు.
ఇక పర్యాటక రంగంపై ఆధారపడిన శ్రీలంక ఆర్థిక వ్యవస్థను కొవిడ్ దారుణంగా దెబ్బతీసింది. చమురు కొనుగోలుకూ విదేశీ మారక నిల్వలు లేని పరిస్థితికి నెట్టేసింది. ప్రస్తుతం ఆ దేశంలో చాలా ఫిల్లింగ్ స్టేషన్ లలో ఖాళీ బోర్డులు దర్శనమిస్తున్నాయి. రెండు షిప్ లలో చమురు వచ్చినా కొనుగోలు చేయలేని దుస్థితి ఉంది. 2021లో ప్రభుత్వం నిర్ణయించిన ధరకే డీజిల్ అమ్మకాలు చేపట్టడమూ ప్రస్తుత సంక్షోభానికి ఓ కారణమైంది.
మన దేశంలో కొవిడ్ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 15వేల 102 కరోనా కేసులు నమోదయ్యాయి. 278మంది కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య లక్షా 64వేల 522కు చేరాయి. పాజిటివిటీ రేటు 1.28 శాతంగా ఉంది. వైరస్ సోకిన వారిలో ఇప్పటి వరకు 4కోట్ల 21లక్షల 89వేల 887 మంది కోలుకున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా 176కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.