యూపీలో ప్రశాంతంగా కొనసాగుతున్న నాలుగో దశ పోలింగ్‌..

frame యూపీలో ప్రశాంతంగా కొనసాగుతున్న నాలుగో దశ పోలింగ్‌..

Veldandi Saikiran
ఢిల్లీః  ఉత్తర ప్రదేశ్ లో నేడు నాలుగవ విడత  అసెంబ్లీ ఎన్నికలు ఇవాళ జరుగనున్న సంగతి తెలిసిందే.  ఏకంగా.. 59 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.  బరిలో 624 మంది అభ్యర్థులు ఉండనున్నారు. ఇక ఇవాళ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరుగనున్న సంగతి తెలిసిందే. గత ఏడాది అక్టోబర్ 3 వ తేదీన, ఒక్కసారిగా  జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచిన లఖింపూర్ ఖేరి లో కూడా ఈ విడతలో జరగనున్నాయి ఎన్నికలు.  లఖింపూర్ ఖేరి లో జరిగిన  హింసాత్మక ఘటనలో నలుగురు రైతులతో సహా, 8 మంది మృతి తెలిసిందే.  లఖింపూర్ ఖేరి తో పాటు, ఫిలిబిత్, సీతాపూర్, హార్దోయ్,  ఉన్నావ్, లక్నో, రాయబలేరి, బాందా, ఫకేపూర్ జిల్లాల్లో మొత్తం 59 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 


2017 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 59 నియోజకవర్గాల్లో,  బిజేపి 51 స్థానాల్లో గెలుపొందగా, 4 స్థానాల్లో సమాజవాది పార్టీ ( ఎస్.పి), 3 స్థానాల్లో బహుజన్ సమాజ్ పార్టీ ( బి.ఎస్పీ), బిజేపి భాగస్వామ్యపక్షమైన “అపనా దళ్” ( సోనేలాల్) ఒక్క స్థానంలో గెలుపొందింది. ఇక ఈ విడతలో పోటీపడుతున్న ప్రముఖుల్లో పలువురు మంత్రులు, మాజీ మంత్రి, డిప్యూటి స్పీకర్, ఇ.డి  మాజీ అధికారి ఉండనున్నారు.  ఈ నాలుగవ విడతలో యు.పి న్యాయ శాఖ మంత్రి బ్రిజేష్ పాఠక్ లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి పోటీ లో ఉండగా, రెండుసార్లు కార్పొరేటర్ గా గెలుపొందిన సమాజవాది పార్టీ ( ఎస్పీ) అభ్యర్ది సురేంద్ర సింగ్ గాంధీ ప్రధాన ప్రత్యర్ధి ఉండనున్నారు.   2017 ఎన్నికల్లో లక్నో సెంట్రల్ స్థానం నుంచి గెలుపొందిన బ్రిజేష్ పాఠక్ కాగా..  తూర్పు లక్నో స్థానం నుంచి బిజేపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మరొక మంత్రి అశుతోష్ టాండన్ ను సవాల్ చేస్తున్నారు ఎస్పీ జాతీయ అధికార ప్రతినిధి అనురాగ్
భదౌరియా.   సమాజవాద్ పార్టీ ని వీడి అధికార బిజేపిలో చేరి, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అయున నితిన్ అగర్వాల్ కూడా ఎన్నికల బరిలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

up

సంబంధిత వార్తలు: