వ్యక్తి కడుపులో ఛాయ్ క్లాస్.. ఎలా వచ్చిందో తెలుసా?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వాడకం ఎలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడో జరిగిన ఘటనలు కూడా కేవలం క్షణాల వ్యవదిలోనే తెలుసుకోగలుగుతున్నారూ. అందరూ. ప్రస్తుత సమయంలో సోషల్ మీడియాలో ఎన్నో ఘటనలు ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయ్. కొన్ని కొన్ని ఘటనలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయ్. ఇది ఎలా సాధ్యమైంది అని అందరికీ అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి తరహా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.



 సాధారణంగా చిన్నప్పుడు కొంతమంది పిల్లలు తెలిసీ తెలియని వయసులో నాణేలను మింగేయడం లాంటివి చేస్తూ ఉంటారూ. ఇలా నాణెం మింగేసిన సమయంలో కొంత మంది డాక్టర్లు వాటిని బయటకు తీయడం ఎలా అని ఉపాయం చెబుతూ ఉంటారు. ఇటీవల కాలంలో ఎంతమంది పెద్దవాళ్లు సైతం బ్రెష్ చేసుకుంటూ బ్రెష్ మింగేయటం.. ఇక ఆ తర్వాత బ్రెష్ కడుపులో ఇరుక్కోవడంతో డాక్టర్ దగ్గరకు పరుగులు పెట్టడం డాక్టర్లు చికిత్స  చేయడం వంటి ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇక ఇప్పుడు మాత్రం కాస్త విచిత్తమైన ఘటన వెలుగు చూసింది.


 బ్రష్, నాణెం లాంటివి కాదు ఏకంగా ఒక గ్లాస్ మింగేశాడు ఒక వ్యక్తి. బీహార్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ముబారక్ పూర్ లో ఒక వ్యక్తి కడుపులో ఏకంగా క్లాస్ బయటపడింది.  కడుపునొప్పితో ఇటీవలే ఆస్పత్రిలో చేరారు అతను. అనుమానం వచ్చిన వైద్యులు అతనికి ఎక్స్రే తీసి కడుపులో చెక్ చేయగా గ్లాస్ ఉన్నట్లు గుర్తించారు. అయితే ఎండోస్కోపి ద్వారా గ్లాస్ ను బయటకు తీసేందుకు ప్రయత్నించిన చివరికి ఫలితం లేకుండా పోయింది. దీంతో శస్త్రచికిత్స చేసి కడుపులో ఉన్న చాయ్ గ్లాస్ బయటకు తీశారు. ఎన్నో రోజుల కిందట స్థాయి తాగేటప్పుడు గ్లాస్ మింగేసాను అంటూ సదరు వ్యక్తి చెబుతున్నాడు. అయితే సదరు చాయ్ క్లాస్ ఆహారనాళంలో  పట్టదని మల ద్వారం ద్వారా వెళ్లి ఉంటుందని అనుమానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: