దిల్ సుఖ్ నగర్ నెత్తుటి గాయానికి తొమ్మిదేళ్లు.. కానీ ఇంకా శిక్ష పడలేదు?

praveen
ఇటీవలి కాలంలో దేశంలో బాంబు పేలుళ్లు తక్కువ అయ్యాయి. కానీ ఒకప్పుడు మాత్రం ఎక్కడ ఎప్పుడు  బాంబు పేలుడు జరుగుతుందో  అని ప్రజలందరూ అనుక్షణం భయపడుతూ బ్రతికేవారు. అంతలా ఉగ్రవాదులు దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలలో మారణహోమం సృష్టించారు అనే చెప్పాలి. ఒకప్పుడు కాశ్మీర్ ప్రాంత ప్రజల మద్దతుతో భారత్లోకి అక్రమంగా చొరబడే ఉగ్రవాదులు.. వివిధ ప్రాంతాల్లో కి చేరి   ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నాయి అని రెక్కీ నిర్వహించి అక్కడ బాంబు పేలుళ్లకు పాల్పడి మారణహోమం సృష్టించారు.


 ఇలా వరుస బాంబు పేలుళ్లతో ఎప్పుడు దేశ ప్రజానీకం మొత్తం భయం గుప్పెట్లోనే బ్రతికేది అని చెప్పాలి. ఇక ఇలాంటి భయానకమైన బాంబు పేలుళ్లలో దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లు కూడా ఒకటి. అంతా ప్రశాంతంగా ఉంది అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా బాంబు పేలుడు జరిగి అందరిని ప్రాణభయంతో పరుగులు పెట్టేలా చేసింది. 2013 ఫిబ్రవరి 21వ తేదీన స్థానిక బస్టాండ్ వద్ద టిఫిన్ బాక్స్ లో బాంబు పేలడంతో ఏకంగా 17 మంది అక్కడికక్కడే మరణించారు. ఇంకా ఎంతో మంది తీవ్ర గాయాలపాలయ్యాయ్. ఈ ఘటనతో  దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది అని చెప్పాలి.




 ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు ఇక ఇలా దిల్సుఖ్నగర్ బస్టాండ్ లో బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఇందులో యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్,తహసీన్ అక్తర్, అజాజ్ షేక్, జియా ఉర్ రెహ్మాన్ ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేయగా ఈ ఉగ్రవాదులకు ఎన్ఐఏ కోర్టు 2016లో ఉరి శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే ఇప్పటి వరకు ఈ ఉగ్రవాదులకు ఉరిశిక్ష అమలు కాలేదు అని చెప్పాలి. కాగా దాదాపు 9 ఏళ్ళ క్రితం దిల్సుఖ్నగర్ లో జరిగిన  పేలుడు ఘటనను గుర్తు చేసుకుంటూ ఎంతో మంది బాధిత కుటుంబాలు వెంటనే ఈ కేసులో పట్టుబడిన ఉగ్రవాదులు అందరికీ ఉరిశిక్ష అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: