జగన్, కేసీఆర్ మధ్య ఒప్పందం ఇదీ..!

Deekshitha Reddy
ఇటీవల కేసీఆర్ కేంద్రంపై కాలు దువ్వుతున్నారు. అందర్నీ కలుస్తున్నారు కానీ, పొరుగు రాష్ట్రం సీఎం జగన్ ని మాత్రం ఆయనింకా కలవలేదు. వారి మధ్య ఒప్పందమేంటనేది బయటకు రావడంలేదు. ఆమాటకొస్తే ఇటీవల కాలంలో జగన్, కేసీఆర్ మధ్య అంత సత్సంబంధాలు లేవని అంటున్నారు. తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టడం అనేది పరోక్ష కారణం అని అనుకున్నా.. ఏ రాష్ట్ర ప్రయోజనాలకోసం ఆ రాష్ట్ర సీఎం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి.

కేసీఆర్ ఇటీవలే మోదీపై ఫైర్ అవుతున్నారు. ఆమధ్య మోదీని కేసీఆర్ కూడా పొగిడిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ కి శత్రువైనంత మాత్రాన.. ఇతరులు కూడా మోదీని శత్రువులుగా భావించాలా, శతృత్వం పెంచుకోవాలా..? స్టాలిన్, మమత, కేజ్రీవాల్.. వీరంతా మొదటి నుంచీ మోదీని వ్యతిరేకిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. బీజేపీతో పోరాడుతున్నారు. మమతా బెనర్జీ బీజేపీతో డైరెక్ట్ ఫైట్ కి దిగి పశ్చిమబెంగాల్ లో అధికారం చేజిక్కించుకున్నారు. కేజ్రీవాల్.. ఢిల్లీపై కేంద్రం పెత్తనంపై పోరాడుతున్నారు. వారికి ఆ సమస్య ఎప్పటికీ ఉంటుంది. కానీ ఏపీలో బీజేపీ అంత బలంగా లేదు. సో.. బీజేపీ అధినాయకత్వంతో జగన్ వైరం పెంచుకోవాల్సిన అవసరమే లేదు. తెలంగాణలో బీజేపీ బలపడుతోంది.. అక్కడ కేసీఆర్ కి ఆ అవసరం ఉంది. మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పక్షాలు కలిస్తేనే.. మరింత బలం పెరుగుతుంది. దీనిపై ఇద్దరు సీఎంలకు ఓ క్లారిటీ ఉందని అంటున్నారు.

2024 సార్వత్రిక ఎన్నికల వేళ ముందుగానే మోదీ వ్యతిరేకులంతా ఒక్కటవుతారు. అయితే ఎన్నికల్లో ఫలితాలు ఈ జట్టుకి అనుకూలంగా వస్తే ఆ తర్వాత జగన్ కూడా చేతులు కలుపుతారు. ఒకవేళ తేడా కొడితే.. మధ్యే మార్గంగా ఉంటారు. ఫైనల్ గా కేసీఆర్ కి, ఆయన ఆధ్వర్యంలో ఏర్పడే కూటమికి తనవంతు సహాయ సహకారాలుంటాయని జగన్ నుంచి హామీ ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలో బీజేపీకి బలం లేదు కాబట్టి.. ఇప్పటికిప్పుడు జగన్ ఆ పార్టీని విమర్శించాల్సిన అవసరం లేదు. సార్వత్రిక ఎన్నికల తర్వాత అవసరం వస్తే వెనక్కి తగ్గే ఆలోచనే లేదు. సో.. జగన్, కేసీఆర్ పూర్తి స్థాయిలో ఈ విషయంలో క్లారిటీతో ఉన్నారన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: