38 మందికి ఉరిశిక్ష.. కోర్టు షాకింగ్ తీర్పు?

praveen
2008లో అహ్మదాబాద్ నగరంలో జరిగిన జంట పేలుళ్లతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనను దేశ ప్రజలు మర్చిపోలేదు అనే చెప్పాలి. జూలై 26 వ తేదీన కేవలం గంట వ్యవధిలోనే అహ్మదాబాద్ నగరంలో సుమారు 21 చోట్ల వరుసగా బాంబు పేలుళ్లు జరిగాయి. ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి, మున్సిపల్ ఎల్జీ ఆస్పత్రి సహా ఎన్నో పార్కింగ్ ప్రదేశాల్లో పేలుళ్లు జరిగాయ్. మొత్తంగా  ఈ బాంబు పేలుళ్ల ఘటనలో  56 మంది ప్రాణాలు కోల్పోయారు. పేలుళ్లలో మరో 200 మంది తీవ్రంగా గాయపడ్డారు.


 తనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మొత్తంగా 85 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత 78 మంది పై విచారణ కొనసాగించగా ఇందులో ఒకరు అప్రూవర్గా మారడంతో అహ్మదాబాద్ పేలుళ్ల వెనుక ఎవరు ఉన్నారు అన్న విషయం బయటపడింది. 2009 లో ప్రారంభమైన ఈ కేసు విచారణ సుదీర్ఘకాలంపాటు 13 సంవత్సరాలకు కొనసాగింది. గత ఏడాది సెప్టెంబర్లో అహ్మదాబాద్ పేలుళ్ల కేసు విచారణ ముగిసింది. ఇకపోతే అహ్మదాబాద్ బాంబు పేలుళ్ళ కేసులో గుజరాత్ ప్రత్యేక కోర్టుకు షాకింగ్  తీర్పు వెలువరించింది. ఇక ఈ కేసులో నిందితులుగా ఉన్న 33మందికి మరణశిక్ష, 11 మందికి జీవిత ఖైదు విధించింది గుజరాత్ ప్రత్యేక కోర్టు.


 ఐపీసీ సెక్షన్ ల తో పాటు చట్ట విరుద్ధ కార్య కలాపాలు నియంత్రణ చట్టం... ఆయుధాల చట్టం కింద ఇక గుజరాత్ ప్రత్యేక కోర్టు శిక్ష విధించినట్లు తెలుస్తోంది. మొత్తం గా 78 మందిని విచారించిన పోలీసులు సరైన ఆధారాలు లేకపోవడం తో 28 మంది చివరికి నిర్దోషులు  గా భావిస్తూ విడుదల చేశారు. ఇక మిగతా వారికి ఇటీవలే గుజరాత్ సుప్రీం కోర్టు కఠిన శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో దేశ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: