వావ్ వావ్ : తెలంగాణ చంద్రుడితో శ్రీ‌కాకుళం రాముడు !

RATNA KISHORE
మ‌నుషులంతా ఒక్క‌టే అన్న‌ది శాస్త్రం
ఇది మాస్టార్జీ అనే తెలంగాణ క‌వి మాట
ఎంతో ఇష్టం ఈ మాట విని పొంగిపోయాను
పొంగిపోయాడు రాము పొంగిపోయారు కేసీఆర్
అనుబంధం రీత్యా ఎర్ర‌న్న‌కుటుంబానికీ రామూకూ
ఎన్నో జ్ఞాప‌కాలు ఉన్నాయి
ఉత్త‌రాంధ్ర యువ ఎంపీ రామూ అంటే క‌విత‌క్క‌కు ఇష్టం
తెలంగాణ చంద్రుడికీ ఇష్టం..
ఆ ఇష్టంకు ప్రేమ‌కు కొన‌సాగింపే క‌ల్వ‌కుంట్ల,కింజ‌రాపు కుటుంబాల
మ‌ధ్య అనురాగ బంధం.. హ‌స్తిన పురి వీధుల్లో భాగ్య‌న‌గ‌రి దారుల్లో..
ఆ ప్రేమ కు కొన‌సాగింపు ఇవాళ రేపు ఇంకా భ‌విష్య‌త్ అంతా!


ఇవాళ తెలంగాణ చంద్రుడు కేసీఆర్ పుట్టిన్రోజు..ఆయ‌న‌కు శ్రీ‌కాకుళం యువ ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు శుభాకాంక్ష‌లు తెలిపారు.వారికి భ‌గ‌వంతుడు ఆరోగ్యం,ఆయుష్షు, ఐశ్వ‌ర్యం ఇవ్వాల‌ని కాంక్షిస్తూ  సోష‌ల్ మీడియ‌లో ఓ ఫొటో ఉంచుతూ శుభాకాంక్ష‌లు అందించారు.ఈ ఫొటో ఆయ‌న ఇంట‌ వివాహ‌వేడుకల‌కు కేసీఆర్ ను ఆహ్వానిస్తున్న సంద‌ర్భంలోనిది.ఈ ఫొటోలో రామూ మామ బండారు స‌త్య‌నారాయ‌ణ (టీడీపీ నేత, పెందుర్తి మాజీ ఎమ్మెల్యే) ఉన్నారు.ఇప్పుడీ ఫొటో కింజ‌రాపు కుటుంబ అభిమానులనే కాదు ఇటు తెలంగాణ‌కు చెందిన ఎంపీ రామూ అభిమానుల‌నూ అల‌రిస్తోంది.ఇక కేసీఆర్ అభిమానులు కూడా ఇరు ప్రాంతాల నేత‌ల మ‌ధ్య స్నేహ బంధాలు ఇలానే కొన‌సాగాల‌ని ఆకాంక్షిస్తున్నారు.

ముఖ్యంగా ఇవాళ ఎంపీ రాము దేశ రాజ‌కీయాల్లో రాణిస్తున్న వైనం తెలిసిందే! ఆయ‌నకు టీఆర్ఎస్ మ‌ద్ద‌తు ఉంది.ఎప్ప‌టి నుంచో ఆయ‌నకు అండ‌గా ఉంటూ,కేసీఆర్ గారాల‌ప‌ట్టి,అప్ప‌టి నిజామాబాద్ ఎంపీ,ఇప్ప‌టి ఎమ్మెల్సీ క‌విత కూడా దీవెన‌లు అందిస్తూ ఉన్నారు.ఉత్త‌రాంధ్ర ప్రాంత స‌మ‌స్య‌ల‌పై మాట్లాడుతున్న ప్ర‌తి సంద‌ర్భంలోనూ క‌విత పిలిచి మ‌రీ! అభినంద‌న‌లు తెలిపిన సంద‌ర్భాలూ ఉన్నాయి.అదేవిధంగా రామూ తండ్రి సీనియ‌ర్ నాయ‌కులు ఎర్ర‌న్నాయుడితో కూడా కేసీఆర్ కు మంచి అనుబంధాలే ఉన్నాయి.ముఖ్యంగా తెలంగాణ నేత‌లంతా కూడా ఎర్ర‌న్న‌కు ఎంతో స‌న్నిహితులు.ఆ విధంగా చూసుకున్నా ఇరు కుటుంబాలు ఇవాళ్టికీ ఎంతో స‌న్నిహితంగా ఉన్నాయి.విభ‌జ‌న చ‌ట్టంపై సంబంధిత అమ‌లులో కేంద్రం జాప్యంచేస్తుండడంపై ఎంపీ రాము ఎప్పుడు మాట్లాడినా టీఆర్ఎస్ మ‌ద్ద‌తు ఇస్తూనే ఉంది. బాహాటంగానే రామూకు అండ‌గా ఉంటూ, మంచికి త‌మ మద్ద‌తు ఉంటుంద‌ని చెబుతూ ఈ ఉత్త‌రాంధ్ర బిడ్డ‌కు  ప్రోత్సాహం ఇస్తున్నారు.వెనుక‌బ‌డిన ప్రాంతాల అభివృద్ధికి తెలుగుదేశం ఎంపీ రామూ తో తాము ప‌నిచేసేందుకు ఎన్న‌డూ  సిద్ధ‌మేనని ఎన్నోసార్లు క‌విత చెప్పారు కూడా! ఓ సంద‌ర్భంలో విభ‌జ‌న ప్ర‌కారం సంబంధిత చ‌ట్టం అమ‌లుకాక ఆంధ్రా ఏ విధంగా న‌ష్ట‌పోతుందో కూడా వివ‌రించి పార్ల‌మెంట్ వేదిక‌గా ఆంధ్రాకు మ‌ద్దతిచ్చారు.

ఆ రోజు ఏపీకి న్యాయం చేయాల్సిందేనని చెప్పి జై ఆంధ్ర నినాదాన్ని క‌విత వినిపించారు.ఆ త‌రువాత కూడా యువ ఎంపీ రామూకు అండ‌గా నిలిచి అంద‌రి మ‌న్న‌న‌లూ అందుకున్నారు.త‌మ్ముడూ మీరు బాగా మాట్లాడుతున్నారు వెరీ గుడ్ అని ఆ త‌ల్లి ఆ రోజు పిలిచి మ‌రీ ఆశీర్వదించారు అని పొంగిపోతారు యువ ఎంపీ రామూ..ఇది ఓ ప్రాంతానికి మ‌రో ప్రాంతానికి ఉన్న స‌ఖ్య‌తకు సంకేతం..తెలంగాణ చంద్రుడా నీకు వంద‌నం.. జేజేలు రామయ్యా! క‌విత‌క్కా ! మీకో కృత‌జ్ఞత ఓ ధ‌న్య‌వాద!


- ర‌త్న‌కిశోర్ శంభుహంతి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: