కేటీఆర్: మోదీ... "ఆంధ్ర - తెలంగాణ"లను కలిపేస్తావా?

VAMSI
తెలంగాణ రాష్ట్రము అంతా ప్రస్తుతం గులాబీ పార్టీ నాయకులు పర్యటిస్తూ ఉన్నారు. రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుండే ప్రజల నాడిని తెలుసుకోవడానికి కూడా ఈ పర్యటనను ఉపయోగించుకోనున్నారు అని చెప్పాలి. అందులో భాగంగానే ఇవాళ పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో కేటీఆర్ బీజేపీ పై తనదైన శైలిలో రెచ్చిపోయారు. బీజేపీ ని ఉద్దేశించి దేశ వ్యాప్తంగా ఉన్న యువకులు మరియు విద్యార్థులను మతం పేరును చెప్పి తమ రాజకీయ స్వార్ధం కోసం వాడుకుంటున్నారని వారిపై తన మాటల అస్త్రాలను ఎక్కుపెట్టారు. అయితే బీజేపీ నాయకులు ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి ఎల్లప్పుడూ మీకు అనుకూలంగానే పరిస్థితులు ఉండవు.

వీలైనంత త్వరలోనే ప్రజలు మీ పార్టీని బ్లాక్ చేసే రోజు వస్తుంది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణకు బీజేపీ ఏమి చేసిందో ఒకసారి చెప్పాలని ఈ సందర్భంగా సవాల్ విసిరారు. ఇక్కడ మా రాష్ట్రానికి సంబంధించిన
అనేక ప్రాజెక్టులపై ఎందుకు అశ్రద్ధ చూపుతున్నారు అంటూ ప్రశ్నించారు. ఇప్పటికి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చి ఏడూ సంవత్సరాలు గడిచాయి. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా ప్రాజెక్టులు కట్టబెట్టారా? వీటన్నింటికీ బీజేపీ నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉదేనని కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఇకనైనా బీజేపీ నేతలు ఎలా వ్యవహరించాలో నేర్చుకోవాలంటూ, ప్రజల జీవితాలతో ఆడుకోకుండా వారికి ఏవి అయితే ఉపయోగకరంగా ఉంటాయో వాటిని నెరవేర్చే పనిలో ఉంటే బాగుంటుందని కేటీఆర్ చెప్పడం విశేషం. ఇప్పటి వరకు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా బీజేపీ ప్రభుత్వం చేసిన దాఖలాలు లేవు. దీనికి ఉదాహరణలుగా చాలానే చెప్పుకోవచ్చు. తెలిసో తెలియకో దేశ ప్రజలు బీజేపీకి కేంద్రంలో పట్టం కట్టారు. తెలంగాణాలో బీజేపీని నమ్మడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు, ఒకవేళ మళ్ళీ బీజేపీకి ఇక్కడ అవకాశం ఇస్తే యధాప్రకారం తెలంగాణ మరియు ఏపీ రాష్ట్రాలను ఒక్కటి చేసేస్తారు అంటూ కేటీఆర్ బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: