సెబ్బాస్ రా జ‌గ‌న్ ! ఏపీకి హోదా త్వ‌రలో! రాస్కో సాంబ‌!

RATNA KISHORE
ఇంద ఇదిగో తీసుకో ప్ర‌త్యేక హోదా నీకే! ఇక నీవు ఆనందంగా ఉండు అని చెప్ప‌బోతోంది కేంద్రం రాష్ట్రానికి. రాష్ట్రానికి అంటే తెలుగు రాష్ట్రాల‌లోఒక్క‌టైన ఆంధ్రావ‌నికి!ఇదంతా జ‌గ‌న్ కృషి కార‌ణంగానే వ‌చ్చింద‌ని కూడా ఓ డ్రామా న‌డిపేందుకు ఛాన్స్ ఉంది. వాస్త‌వానికి ఆ రోజు నుంచి ఈ రోజు వ‌ర‌కూ వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక హోదాపై పట్టుబ‌డుతూ మాట్లాడింది లేదు.వెనుక బ‌డిన ప్రాంతాల సంక్షేమానికి ఇచ్చిందీ లేదు. మొన్న‌టి బ‌డ్జెట్ లో ప్ర‌స్తావించి ఏడ్చిందీ లేదు న‌వ్విందీ లేదు. కానీ కేంద్రం కొత్త డ్రామా ఎందుకు న‌డుపుతుంది అంటే కేసీఆర్ త‌న‌పై చేస్తున్న తిరుగుబాటును తీరుబాటుగా తిప్పికొట్టేందుకు..అదే విధంగా తెలుగు రాష్ట్రాల అప్పులు ఇప్పుడు సెటిల్ చేస్తే ఆర్థికంగా తెలంగాణకే ఎక్కువ న‌ష్టం ఎందుకంటే విద్యుత్ బ‌కాయిల రూపంలో ఆంధ్రాకు చెల్లించాల్సింది వేల కోట్ల రూపాయ‌ల్లోనే అని తెలుస్తోంది.రాష్ట్రం విడిపోయినా కూడా ఆ రోజు ఆంధ్రా విద్యుత్ ఉత్ప‌త్తి కేంద్రాల నుంచే తెలంగాణ‌కు స‌ర‌ఫ‌రా వెళ్లింది.అంతేకాదు కీల‌కం అయిన సీలేరు జ‌ల‌విద్యుత్ ను కూడా ఆంధ్రాకే ద‌క్కించారు.దాంతో తెలంగాణ మొద‌ట్లో విద్యుత్ విష‌యమై కొన్ని క‌ష్టాలు చ‌విచూసింది.త‌రువాత మెల్ల‌గా అధిగ‌మించి, ఇప్పుడు నిల‌దొక్కుకుంది.


 
ఈ నేప‌థ్యంలో ఉమ్మ‌డి ఆస్తులు లెక్క తేల్చినా, ఎవ‌రి అప్పు ఎంత అన్న‌ది తేల్చినా నెగ్గేది ఆంధ్రానే. క‌నుక కొత్త డ్రామాకు కేంద్రం తెర‌లేపింది. ఓ విధంగా ఇలాంటి వాటిని పోస్ట్ బ‌డ్జెట్ ప్ర‌పోజ‌ల్స్ లో భాగంగా చూపిస్తారు. సో .. ఆ విధంగా జ‌గ‌న‌న్న గెలిచాడు.. కేసీఆర్ ఆయ‌నను గెలిపించాడు.బీజేపీ అనే పెద్ద జాతీయ పార్టీ జ‌గ‌న‌న్న ను హీరో చేసేందుకు తెగ తాప‌త్ర‌య ప‌డుతోంది. ఇదీ ఈ క‌థ‌లో రాసుకోద‌గ్గ వివ‌రం.


ఆంధ్రావ‌నికి ప్ర‌త్యేక హోదా ద‌క్కించ‌డంపై ఎట్ట‌కేల‌కు కేంద్రం స్పందించింది. ఈ నెల 17ను ఢిల్లీ రావాల‌ని చెప్పింది. అంటే ఆ రోజు చాలా విష‌యాలు చ‌ర్చ‌కు రానున్నాయి కూడా తేలింది.మొత్తం 9 అంశాల‌తో కూడిన లేఖ ఒక‌టి కేంద్రం నుంచి రావ‌డంతో ఇరు తెలుగు ప్రాంతాలూ ఆనందం వ్య‌క్తం చేస్తున్నాయి.గ‌త కొద్ది కాలంగా ప్ర‌త్యేక హోదాపై చాలా అంటే చాలా ప‌ట్టుబ‌డుతున్న టీడీపీ క‌న్నా వైసీపీ క‌న్నా కేసీఆరే ఎక్కువ సాధించారు. కానీ ఇప్పుడు క్రెడిట్ మాత్రం జ‌గ‌న్ కే ద‌క్కుతుంది.ద‌క్క‌నిస్తారు కూడా! హోదా ఇవ్వ‌క‌పోయినా స‌రే వైసీపీకి క్రేజ్ వ‌స్తుంది. ఎందుకంటే జ‌నంలో కేసీఆర్ ను జీరో చేసి జ‌గ‌న్ ను హీరో చేయాల‌న్న బీజేపీ యోచ‌న‌లో భాగంగానే రాష్ట్రానికి ఏదో ఒక క్ష‌ణాన హోదా ద‌క్కేందుకు అవ‌కాశాలే ఎక్కువ.అయితే హోదాపై గ‌తంలో ఎన్నోసార్లు ప‌క‌బ‌డ్బందీగా మాట్లాడింది యువ ఎంపీ రామూనే! కానీ ఆయ‌న పేరు ఎక్క‌డా వెలుగులోకి రానివ్వ‌కుండా జ‌గ‌న్ నే హీరో చేసేందుకు బీజేపీ బాగానే పాట్లు ప‌డుతోంది. ప‌ట్టు బ‌డుతోంది కూడా!
 
 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: