అమరావతి : జగన్ దెబ్బను తట్టుకోలేకపోతున్నాయా ?

Vijaya


అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా ప్రత్యర్ధి పార్టీలను దెబ్బ కొట్టేందుకే ప్రయత్నిస్తుంది. అయితే ప్రత్యర్ధిపార్టీలు  ఏమేరకు దెబ్బతిన్నాయనేది అధికారపార్టీ సామర్ధ్యాన్ని, వ్యూహాలను బట్టి ఉంటుంది. ఇపుడు అధికారంలో ఉన్న వైసీపీ కొట్టే దెబ్బకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు ఇతర ప్రతిపక్షాలు కూడా ఏవీ తట్టుకోలేకపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి వ్యూహాల దెబ్బకు ఉక్కిరిబిక్కిరైపోతున్నాయి. అలాంటి వ్యూహంలోనే ప్రతిపక్షాలను జగన్ మళ్ళీ ఇరికించుకునేందుకు రెడీ అయిపోయారు.




ఇంతకీ విషయం ఏమిటంటే రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మళ్ళీ మూడు రాజధానుల బిల్లు తీసుకు రావటానికి జగన్ ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మంత్రి కొడాలి నాని మీడియా సమావేశంలో చెప్పారు. ప్రతిపక్షాలు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని కొడాలి చెప్పారు. అనుమానమే అవసరం లేదు ప్రతిపక్షాల్లో ఏ ఒక్కటీ 3 రాజధానులను అంగీకరిచవని అందరికీ తెలిసిందే.




ఇప్పటికే జిల్లాల పునర్వ్యస్ధీకరణతో ప్రతిపక్షాలు బాగా ఇబ్బందులు పడుతున్నాయి. 13 జిల్లాలను 26 జిల్లాలు చేయబోతోంది ప్రభుత్వం. ఉగాది నాటికి కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చేస్తాయనటంలో సందేహంలేదు. రాజంపేట, హిందుపురం, విజయవాడ, ధర్మవరం లాంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రం జిల్లాల కేంద్రాలను మార్చాలని, పేర్లు మార్చాలనే డిమాండ్లున్నాయి. ఇవి మినహా చాలా చోట్ల ప్రశాంతంగానే ఉంది. దీంతో కొత్త జిల్లాల సంఖ్యను టీడీపీ వ్యతిరేకిస్తోంది. అయితే కొత్త జిల్లాల ప్రక్రియను అడ్డుకోలేకపోతొంది.




కొత్త జిల్లాల విషయంలోనే పోరాటం చేయలేక చేతులెత్తేసింది. దీనికి అదనంగా మూడు రాజధానుల బిల్లును కూడా మళ్ళీ ప్రవేశపెడితే అంతే సంగతులు. జిల్లాల సంఖ్యను పెంచటానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలా ? 3 రాజధానుల బిల్లులకు వ్యతిరేకంగా పోరాటం చేయాలా ? అనే విషయం ప్రతిపక్షాలకు అర్ధం కావటంలేదు. జిల్లాల పెంపును ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పలేకపోతున్నారు. 3 రాజధానుల బిల్లుల్లో చెప్పినట్లు వైజాగ్, కర్నూలుకు వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నారు. ఇలాంటి సంకట పరిస్ధితుల్లో ప్రతిపక్షాలు ఇరుక్కుపోయి అవస్తలు పడుతున్నాయి.  అసెంబ్లీ సమావేశాలు కాగానే రచ్చబండ పేరుతో జిల్లాల టూర్లు ప్లాన్ చేసుకున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: