అక్కడ జనసేనని నిలబెట్టేది ఎవరు?
అసలు ఇంకా చెప్పాలంటే జనసేన పూర్తిగా పవన్ ఇమేజ్ పైనే ఆధారపడి ముందుకెళుతుంది. అయితే పవన్ ఇమేజ్‌తో బండి లాగించాలంటే చాలా కష్టమైపోతుంది..పార్టీకి బలమైన నాయకత్వం, క్యాడర్ బలం కావాలి..అప్పుడే టీడీపీ-వైసీపీలకు పోటీగా జనసేన నిలుస్తుంది. ఉదాహరణకు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేనకు బలమైన నాయకులు ఉన్నారు..అందుకే ఆ రెండు జిల్లాల్లో టీడీపీ-వైసీపీలతో ఢీ అంటే ఢీ అనేలా జనసేన ఉంది. అలాగే కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో కూడా జనసేనకు కాస్త క్యాడర్ బలం..నాయకులు బలం ఉంది.
కానీ మిగిలిన జిల్లాల్లో జనసేనకు బలమైన నాయకత్వం కనిపించడం లేదు...ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో జనసేనకు ఏ మాత్రం బలం లేకపోవడానికి కారణం...బలమైన నాయకత్వం, క్యాడర్ లేకపోవడమే. సరే సీమలో బలం లేకపోతే కోస్తాలో అయిన పార్టీకి బలం ఉండాలి. కానీ కోస్తాలో కూడా కొన్ని జిల్లాలకే జనసేన బలం పరిమితమైంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనసేనకు బలం తక్కువగా ఉంది.
ఏదో విశాఖలో కొద్ది మేర జనసేనకు బలం కనిపిస్తోంది..విశాఖ నగరంలో, గాజువాక, భీమిలి లాంటి స్థానాల్లో పార్టీకి బలం కనిపిస్తోంది. కానీ రూరల్ ప్రాంతంలో జనసేనకు బలం లేదు. అటు విజయనగరంలో జనసేన పరిస్తితి దారుణంగా ఉంది...ఇక్కడ పార్టీకి ఏ మాత్రం పట్టు లేదు...అలాగే బలమైన నాయకత్వం కూడా లేదు. ఇక శ్రీకాకుళం జిల్లాలో కూడా అదే పరిస్తితి. గత ఎన్నికల్లో సిక్కోలులో జనసేన సత్తా చాటలేకపోయింది. కొద్దోగొప్పో ఇక్కడ జనసేనకు క్యాడర్ ఉంది...కాకపోతే సరైన నాయకులు లేక పార్టీ దిక్కులేకుండా పోతుంది.