కేటీఆర్ కవరింగ్?

M N Amaleswara rao
రాజకీయాల్లో ఒక వివాదాన్ని పక్కదారి పట్టించాలంటే మరొక వివాదం తెరపైకి తీసుకురావాలి..దాన్నే పోలిటికల్ డైవర్షన్ గేమ్ అంటారు. ఈ గేమ్ ఆడటంలో రాజకీయ నేతలు ఎప్పుడు ముందే ఉంటారు..ఇప్పుడు తెలంగాణలో ఈ గేమ్ మంత్రి కేటీఆర్ బాగా ఆడుతున్నారని చెప్పొచ్చు. అసలు కేసీఆర్ లేపిన వివాదాన్ని చాలా చక్కగా కవర్ చేసుకుంటూ వచ్చేశారు. ఇటీవల రాజ్యాంగంపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే...రాజ్యాంగం మార్చాలంటూ కామెంట్ చేశారు.

ఇక కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి...అసలు రాజ్యాంగం మార్చాలని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలని తీవ్ర స్థాయిలో ఖండించారు..కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేశారు. అయితే రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కాస్త..టీఆర్ఎస్‌కు డ్యామేజ్ చేశాయని చెప్పొచ్చు. రాజ్యాంగంపై కామెంట్ చేసి...డాక్టర్ అంబేడ్కర్‌ని అవమానించారని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఈ వ్యాఖ్యల వల్ల దళితుల్లో టీఆర్ఎస్‌పై వ్యతిరేకత పెరిగింది.

ఇక దీన్ని కవర్ చేయడానికి కేటీఆర్ రంగంలోకి దిగారు...ఇటీవల హైదరాబాద్ వచ్చి సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే..దీనిపై కేటీఆర్ కామెంట్ చేశారు..సమన్యాయం చేయలేని నాయకుడు..సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారని విమర్శించారు. దీంతో బీజేపీ నేతలు ఈ అంశంపై రచ్చ చేయడం మొదలుపెట్టారు. రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలని వదిలేసి..కేటీఆర్‌కు కౌంటర్లు ఇచ్చారు.

ఇదే క్రమంలో తాజాగా ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ విభజనపై కామెంట్ చేశారు..కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన సరిగ్గా చేయలేదని, పార్లమెంట్ తలుపులు మూసివేసి విభజన చేశారని మోదీ అన్నారు. అదిగో రాష్ట్ర విభజనని తప్పుబట్టి తెలంగాణ ఉద్యమాన్ని అవమానించారని చెప్పి కేటీఆర్ ఫైర్ అవుతున్నారు. అలాగే తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయాలని, దిష్టి బొమ్మలు తగలబెట్టాలని టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. అంటే టోటల్‌గా రాజ్యాంగం కథని కేటీఆర్ కవర్ చేసేశారు. బీజేపీ శ్రేణులు, కాంగ్రెస్ శ్రేణులు ఇప్పుడు మోదీ వ్యాఖ్యలపై పడ్డారు. మొత్తానికి కేటీఆర్ మాత్రం టీఆర్ఎస్‌కు డ్యామేజ్ జరగకుండా బాగానే కవర్ చేశారని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: