వావ్ వావ్ : ఉపాధ్యాయుల ఉద్యమంలోకి బాలయ్య ! అన్ స్టాపబుల్
మేం పీఆర్సీ అడిగాం
మేం 27శాతం ఫిట్మంట్ ను అయినా సాధించాలని అడిగాం
మేం చీకటి జీఓలను రద్దు చేయాలని అడిగాం
ఇవేవీ అమల్లోకి లేవు అందుకే
మేం అడిగింది పీఆర్సీ మీరు ఇస్తామంటున్నది రివర్స్ పీఆర్సీ బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ ఉపాధ్యాయులు రోడ్డెక్కుతున్నారు. అయితే మినిట్స్ తయారు అయిపోయాక మళ్లీ కొత్త రగడ ఎందుకు సృష్టిస్తున్నారని, ఆ రోజు చర్చల సమయంలో మేం చెప్పిన వాటికి అన్నింటికీ ఒప్పుకున్న ఉపాధ్యాయులు ఇప్పుడెందుకు ఈ విధంగా రివర్స్ గేర్ వేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సజ్జల రామకృష్ణా రెడ్డి అంటున్నారు. సజ్జల మాటలు ఎలా ఉన్నప్పటికీ ఉద్యమంలో వేడి పుట్టించాలంటే బాలయ్య డైలాగులే కీ రోల్ ప్లే చేస్తాయని ఉపాధ్యాయులు అంటున్నారు.
ఇంకా చెప్పాలంటే...
ప్రస్తుతం ఆంధ్రావని అంతటా పీఆర్సీ వివాదమే వినిపిస్తోంది.ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగులను మోసం చేశారంటూ, ఉద్యోగ సంఘాల నాయకులను నమ్ముకున్న పాపానికి తాము నిండా మునిగిపోయామంటూ గగ్గోలు పెడుతున్నారు ఉపాధ్యాయులు.దీంతో ఉద్యమంను మరింత ఉద్ధృతం చేయాలన్న ఆలోచనతో వీళ్లంతా ముందుకు వెళ్లాలని యోచిస్తున్నారు. ఉద్యమానికి మరింత ఉత్సాహం ఇచ్చేలా బాలయ్య డైలాగును మార్చుకుని వాడుకుంటూ.. జగన్ ను టార్గెట్ చేస్తూ..మీడియా ఎదుట మాట్లాడుతున్నా రు. మేం అడిగింది ఫిట్మెంట్ నువ్వు చేస్తామన్నది సెటిల్మెంట్.. బోత్ ఆర్ నాట్ సేమ్ అని అంటూ గోడు వినిపిస్తున్నారు.దీంతో పాటు ఇంకొన్ని డైలాగులు కూడా ఇదే తరహాలో వినిపిస్తున్నారు. సో..బాలయ్య వీళ్లకు ఎంతో హెల్ప్ అవుతున్నారన్న మాట! అన్న మాట కాదు ఉన్న మాట కూడా!
\
బాలయ్య తరువాత బన్నీ కూడా వీళ్లకు చాలా మాట సాయం పాట సాయం చేస్తున్నారు. ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా అని అంటున్నారు కొందరు.. ఇంకొందరు ఊ అంటావా ఊహూ అంటావా అని పాడుకుంటున్నారు. ఊ అంటావా ఊహూ అంటావా పాట పై మాత్రం పూర్తిగా అభ్యంతరాలు ఉన్నాయి. ఉద్యోగ సంఘాలు కూడా ఉపాధ్యాయుల తీరును ఈ ఒక్క పాట విషయమై అభ్యంతరాలు చెప్పాయి కూడా! అయినా ఉపాధ్యాయులు క్రేజ్ కోసం
ఈ పాటను పాడకుండా ఉండడం కుదరని పని అని తేల్చేస్తున్నారు.
మొత్తానికి బాలయ్య ఓ వైపు హిందూపురం జిల్లా సాధనకు ఉద్యమం చేస్తూ ఉంటే మరోవైపు బాలయ్య డైలాగులను వాడుకుని ఉపాధ్యాయులు మరింత సమరోత్సాహంతో రేపటి నుంచి కార్యాచరణను ఉద్ధృతం చేయాలని చూస్తున్నారు.దీంతో ఎవరి వాదన ఎలా ఉన్నా కూడా ఉద్యమం అయితే మళ్లీ మొదలు కావడం ఖాయం. తాము చెప్పిన విధంగా నడుచుకోని ఉద్యోగ సంఘాల నాయకులను బండ బూతులు తిడుతున్నారు ఉపాధ్యాయులు.వారి పటాలలకు దండలు వేస్తున్నారు. కొందరు వారి దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తున్నారు.అయినా కూడా ఉద్యమం ఆపేదే లేదని తేల్చేస్తున్నారు.అదేవిధంగా బాలయ్య డైలాగులతో
మరికొంత ఉత్సాహం వచ్చి తాము ఇంకా వేగంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లగలుగుతున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు.