విద్యార్థులకు శుభవార్త: నేటి నుండి ఆన్లైన్ క్లాసులు స్టార్ట్...

VAMSI
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కారణంగా గత కొద్ది రోజుల ముందు అన్ని విద్యా సంస్థలు తాత్కాలికంగా మూసి వేసిన సంగతి తెలిసిందే. అయితే అనవసరంగా విద్యార్థుల భవిష్యత్తు ఎక్కడ నాశనం అయిపోతుంది అని రాష్ట్రము లోని విద్యార్థుల తల్లితండ్రులు ఎంత గానో బాధ పడ్డారు. గతంలో ఇదే విధంగా ఒక సంవత్సరం కాలం మొత్తం విద్యాసంస్థలు లేక పోవడంతో ఎందరో ప్రతిభావంతులైన విద్యార్థులు మరియు ప్రతిభ లేని విద్యార్థులు అందరూ ఎటువంటి పరీక్ష లేకుండానే పాస్ అయి పోయిన వైనం అందరినీ ఎంత గానో బాధకు గురి చేసింది. ఆ తర్వాత ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యలు మూలంగా విద్యార్థుల అందరి లోనూ అగ్రహా ద్వేషాలు చెలరేగాయి.
అలా అంతా సర్దుమణిగింది. మళ్ళీ యధావిధిగా స్కూల్స్ ప్రారంభం అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ కరోనా కారణంగా జనవరి 31 వతేదీ వరకు స్కూల్స్ మూసివేశారు. అయితే ప్రభుత్వ ప్రకటన ప్రకారం ఫిబ్రవరి 1 నుండి అన్ని విద్యాసంస్థలు ఓపెన్ చేశారు. కానీ విద్యార్థుల తల్లితండ్రులు స్కూల్స్ యాజమాన్యాలకు షాక్ ఇచ్చారని చెప్పాలి. మొదటి రోజు స్కూల్స్ కి వచ్చిన వారు కనీసం 30 శాతం కూడా లేకపోవడం గమనార్హం. ఇందుకు తెలంగాణ హై కోర్ట్ బాగా అలోచించి ఒక నిర్ణయం తీసుకుంది. స్కూల్స్ కి రాలేని విద్యార్థులు అందరికీ ఆన్ లైన్ ద్వారా తరగతులు బోధించాలని ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ ప్రభుత్వ హై కోర్ట్ సూచన మేరకు ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా అందరి విద్యార్థులకు టీ శాట్ ద్వారా ఇంకో అయిదు రోజుల వరకు ఆన్లైన్ క్లాసులు జరుగుతాయాని తెలిపింది. ఇది నిజంగా విద్యార్థులకు ఒక గొప్ప శుభవార్త అని చెప్పాలి. ఎందరో తల్లితండ్రులు కరోనా కోసం భయపడి తమ పిల్లలలను స్కూల్స్ కి పంపడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: