వెన్నుపోటు.. ఉక్రెయిన్ కి షాక్?
ఇక ఇంత మద్దతు వచ్చిన తర్వాత ఉక్రెయిన్ ఊరుకుంటుందా యురోపియన్ యూనియన్ నాటో దేశాలను గుడ్డిగా నమ్మి రష్యాతో యుద్ధానికి సిద్ధమైంది. నువ్వో నేనో తేల్చుకుందాం ఖబర్దార్ అంటూ వార్నింగ్ ల మీద వార్నింగ్ లు ఇచ్చేసింది. ఇలాంటి స్టేట్ మెంట్ వచ్చిన తర్వాత రష్యా ఊరుకుంటుందా.. ఇప్పటికే ఉక్రెయిన్ కు సంబంధించిన దీవులను స్వాధీనం చేసుకుంది ఉక్రెయిన్ ఏ మాత్రం ఆయుధ ప్రయోగం చేసిన దాడి చేసి పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు సిద్ధమైంది.
ఇలాంటి సమయంలో ఉక్రెయిన్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఒకవైపు నాటో దేశాలు మరోవైపు యూరోపియన్ యూనియన్ దేశాలు 'అసలు మీరు ఎవరు సార్' అంటూ డైలాగ్ చెప్పినట్లుగానే వ్యవహరిస్తున్నాయి. అవును మరి మేము ఆయుధాలను పంపిస్తాం సైన్యాన్ని పంపిస్తాము అంటూ ఎన్నో గొప్పలు చెప్పిన యూరోపియన్ యూనియన్ దేశాలు ఇప్పుడు పంపించేదేలే అంటూ షాకిస్తున్నాయ్. ఒకవేళ పంపించిన మిని టీమ్స్ పంపిస్తాము అంటూ అడపాదడపా మద్దతు ప్రకటిస్తున్నారు. ఇలా ఒక రకంగా ఉక్రెయిన్ ను అన్ని దేశాలు నమ్మించి మోసం చేశాయ్ అని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు రష్యా మీదికి దూసుకు వస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్ ఏం చేస్తున్నది మాత్రం హాట్ టాపిక్ గా మారింది.