కేటీఆర్: మోదీ... 'ఎందుకు మాపై ఈ సవతి ప్రేమ'?

VAMSI
దేశ ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ సాక్షిగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ నిన్న ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడు బడ్జెట్ పెట్టినా? బడ్జెట్ ఎంత బాగున్నా ప్రతిపక్ష పార్టీల నుండి విమర్శలు రావడం సహజం. వీటిని ఎవ్వరూ ఆపలేరు. అయితే నిన్న ప్రవేశ పెట్టిన బడ్జెట్ గురించి కూడా పలువురు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ రాష్ట్రం ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో ఇది హాట్ టాపిక్ అయింది.

ఈయన మాట్లాడుతూ బడ్జెట్ అంతా బాగా పరిశీలించాను. ఇందులో దేశానికి ముఖ్యం మరియు బలమైన పేదలకు ఎటువంటి ఆశాజనకమైన బడ్జెట్ కేటాయించలేదు అని కొట్టిపారేశారు. ఇక మా రాష్ట్రము విషయానికి వస్తే ఇంతకు ముందు ఎన్నో సార్లు కేంద్రాన్ని ఒక్కటే కోరాము, మా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి చేయూతను ఇవ్వండి అని కానీ ఈ విషయము ఏ మాత్రం పట్టించుకోలేదని వాపోయారు కేటీఆర్.  ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు మరియు ఇతర అంశాల విషయంలో తగినంత నిధులు ఇవ్వడంలో కేంద్రం మరోసారి మొండి చేయి చూపిందని తన గోడును విన్నవించుకున్నారు.

మా తెలంగాణపై మోడీ ప్రభుత్వం ఇకనైనా ఈ సవతి తల్లి ప్రేమను విడనాడాలని రాష్ట్రం అభివృద్ది కోసం పార్టీలకు అతీతంగా కేంద్రం సహాయం చేయాలన్నారు. అయితే కేంద్రం బడ్జెట్ లో మా రాష్ట్రానికి తగిన నిధులను ఇవ్వకపోయినా మా ప్రభుత్వం అభివృద్ధి పనులను పూర్తి చేయడంలో తగ్గేది లేదని ఈ సందర్భంగా చెప్పారు కేటీఆర్. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని స్కూల్స్ ను నవీకరణం చేయనున్నామని తెలిపారు. ఇంతకు ముందు కేసీఆర్ కూడా బడ్జెట్ విషయంలో మాకేమి చేసింది ఏమీ లేదని మాట్లాసిన సంగతి తెలిసిందే. మరి ఈ విషయంలో బీజేపీ నుండి ఎవరైనా కౌంటర్ ఇస్తారా అన్నది ఇంకా తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: