ఢిల్లీః ఇవాళ్టి నుంచే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగనున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. ఈ సారి జరిగే టు వంటి పార్లమెంట్ శీతాకాలపు సమావేశాలు.. మొత్తం 29 సిట్టింగులతో ( పనిదినాలు) రెండు విడతలుగా జరిగే అవకాశాలు ఉన్నట్లు స్పష్టమైన సమాచారం అందుతోంది. మొదటి విడతలో ( జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు) 10 సిట్టింగులు ( పనిదినాలు) జరుగనుండగా.. రెండవ విడతలో ( మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు) 19 సిట్టింగులు ( పనిదినాలు) జరిగే అవకాశాలు ఉన్నట్లు స్పష్టమైన సమాచారం అందుతోంది. ప్రతిరోజు ప్రతిసభ 5 గంటల పాటు సమావేశం జరుగనుండగా... మొదటి రెండు రోజులు మినహాయిస్తే—-తొలిరోజు రాష్ట్రపతి ప్రసంగం, మరుసటి రోజు ఆర్దిక మంత్రి బడ్జెట్ ప్రసంగం—-వాస్తవంగా జరిగే సిట్టింగులు 27 ఉండన్నట్లు తెలుస్తోంది.
అలాగే.. రెండు విడతలుగా జరిగే సమావేశాలకు కలిపి, ప్రతిసభ కు మొత్తం సభా కార్యక్రమాలు నిర్వహణకు లభించే సమయం 135 గంటలు జరుగనున్నట్లు స్పష్టమైన సమాచారం అందుతోంది. తొలివిడత బడ్జెట్ సమావేశాల్లో లభించే మొ త్తం సమ యం 40 గంటలు జరుగనుండగా.. రెండవ విడత బడ్జెట్ సమావేశాల్లో లభించే మొత్తం సమయం 95 గంటలు కొనసాగనున్నట్లు అర్థమౌవుతోంది. ప్రతిరోజు సమావేశాల్లో జీరో అవర్ ను అరగంటకు కుదించిన రాజ్యసభ... రెండు విడతల్లో జరిగే మొత్తం 27 సిట్టింగులకు గాను “జీరో అవర్” కోసం మొత్తం 13.30 గంటలు సమయం కేటాయింపు చేసే చాన్స్ కూడా లేక పోలేదు. ప్రశ్నోత్తరాల సమయం ( క్వచ్చన్ అవర్) యధాతధంగా 27 సిట్టింగులుకు గానూ, ప్రతిరోజు గంట చొప్పున మొత్తం 27 గంటలు కేటాయుంపులు జరిగే చాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. “ప్రయువేట్ మెంబర్స్” బిజినెస్ కోసం 15 గంటలు కేటాయుంపు లు ఉండనున్నాయి.