వ్యాక్సిన్ తెచ్చిన తంటా.. పారిపోయిన ప్రధాని?
కెనడా లో కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. వ్యాక్సిన్ వేసుకోవాలంటు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎంతో మంది నిరసనకారులు రోడ్లపైకి చేరి ఉద్యమాలు చేపట్టారు. ఈ క్రమంలోనే రాజధాని నగరంలో కి ఒక్కసారిగా దూసుకు వస్తూ ఉండటంతో చివరికి కెనడా ప్రధానమంత్రి అధికారిక నివాసం నుంచి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లి పోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఆయన కుటుంబాన్ని భద్రతా బలగాలు రహస్య ప్రాంతానికి తరలించారు. ఇక వ్యాక్సిన్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకారులు రాజధాని ఓట్టొవా కు భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలోనే భద్రతా బలగాలు ముందుజాగ్రత్తలు చర్యల్లో భాగంగా ప్రధానిని రహస్య ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది.
కెనడాలో ఫ్రీడమ్ కాన్వాయ్ పేరిట నిరసనలు జరుగుతున్నాయి. దేశంలోకి వచ్చే ట్రక్కు డ్రైవర్ లకు టీకా తప్పనిసరి ఉండాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ట్రక్కు డ్రైవర్ లందరూ ఫ్రీడమ్ కాన్వాయ్ పేరిట నిరసనలు తెలుపుతున్నారు.. అయితే ఇలా నిరసన చేస్తున్న ఉద్యమకారులు ఏకంగా సైనిక స్మారక లపై ఎక్కి డాన్సులు చేస్తూ ఉండడం సంచలనంగా మారిపోయింది. ఇక ఈ ఘటనపై స్పందించిన ఆర్మీ అధికారులు సైనిక సమరయోధుల సమాధులపై నిరసనకారులు డాన్సులు చేస్తూ అవమానించడం ఎంతో బాధ కలిగించింది అంటూ చెప్పుకొచ్చారు.