వద్దంటున్న అమెరికా.. తగ్గేదేలా అంటున్న భారత్?

praveen
భారత రక్షణ  రంగాన్ని పటిష్టవంతం చేసుకోవడమే లక్ష్యంగా గత కొన్ని రోజుల నుంచి భారత ప్రభుత్వం ఎంత వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తుంది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు దౌత్య పరంగా అన్ని దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకుంటూనే మరోవైపు కొన్ని దేశాలతో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత త్రివిధ దళాలను కూడా ఎంతో పటిష్టవంతంగా మార్చుకోవడాన్ని యజ్ఞం లా చేయబడుతుంది. ఇక్కడ ఉన్న ఇతర దేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడమే కాదు. స్వదేశంలో కూడా ఆయుధాలను అభివృద్ధి చేస్తూ వాటి ప్రయోగాలు నిర్వహించి భారత అమ్ములపొదిలో చేర్చుకుంటుంది అన్న విషయం తెలిసిందే.



 ఇక ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏ క్షణంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అనేది ఊహకందని విధంగా  ఉంది. దీంతో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సరికొత్త  టెక్నాలజీతో కూడిన ఆయుధాలు కొనుగోలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల రష్యా కు సంబంధించిన అద్భుతమైన ఎస్-400 క్షిపణి వ్యవస్థను భారత్ కొనుగోలు చేసింది. ఇక వీటిని ఇటీవలే సరిహద్దుల్లో మొహరించింది. భారత్ రష్యా తో కలిసి భారత్ వేదికగా s500 మిస్సైల్స్ ను  కూడా తయారు చేస్తూ ఉండటం గమనార్హం.



 ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రం నుంచి భారత్ ఆయుధాలు కొనుగోలు చేయడంతో కుళ్ళుకుంటున్న అగ్రరాజ్యమైన అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. గతంలోనే రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయవద్దు అంటూ  భారత్ కి సూచించిన అమెరికా ఇటీవల మరోసారి ఇదే విషయం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రాంతాన్ని అస్థిర పరిచేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నాలు ఇది బహిర్గతం చేస్తుందని అమెరికా పేర్కొంది. సోవియట్ దేశం నుంచి ఆయుధాలు కొనుగోలు చేయవద్దని తాము అన్ని దేశాలను  కోరుకుంటున్నాము అంటూ అమెరికా చెప్పింది. అయితే తమ దేశ భద్రత దృష్టిలో పెట్టుకునే మేము నిర్ణయాలు తీసుకుంటున్నాము అంటూ భారత్ బదులు ఇవ్వడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: