ప్రొద్దుటూరులో టీడీపీకి ఛాన్స్ వస్తుందా?

M N Amaleswara rao
అసలే కడప జిల్లా..అందులో ప్రొద్దుటూరు పూర్తిగా వైసీపీ కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..అలాంటి కంచుకోటలో అసలు టీడీపీకి గెలిచే అవకాశాలు వస్తాయా? అంటే అబ్బే ఏ మాత్రం రావని చెప్పొచ్చు. కాకపోతే నిదానంగా కొన్ని రాజకీయ పరిస్తితులు మారుతున్నాయి. గతంలో మాదిరిగా ఇప్పుడు వైసీపీకి అనుకూల పరిస్తితులు మాత్రం లేవనే చెప్పాలి. వాటి గురించి మాట్లాడుకునే ముందు...ప్రొద్దుటూరు నియోజకవర్గం గురించి చూస్తే...ఇక్కడ మొదట నుంచి కాంగ్రెస్ హవా నడిచేది.
టీడీపీ ఆవిర్భావించక కేవలం 1985లో మాత్రం టీడీపీ గెలిచింది. ఆ తర్వాత వరుసగా కాంగ్రెస్ గెలిచింది. అయితే 2009లో టీడీపీకి మరొకసారి అవకాశం వచ్చింది. అప్పుడు కడప జిల్లాలో అన్నీ సీట్లలో కాంగ్రెస్ గెలిస్తే, ఒక్క ప్రొద్దుటూరులో మాత్రం టీడీపీ గెలిచింది. ఇక 2014, 2019 ఎన్నికల్లో వరుసగా వైసీపీ గెలిచింది. వైసీపీ నుంచి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విజయం సాధించారు. ఇప్పుడు ఆయనే సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇక ప్రస్తుతానికి ప్రొద్దుటూరులో శివకు తిరుగులేని బలం ఉంది..బలమైన ఫాలోయింగ్ కూడా ఉంది.
కాకపోతే ఈ బలం పక్కనబెడితే, పనితీరు పరంగా కూడా పర్వాలేదనిపిస్తున్నారు. అయితే ఇంకాస్త ఎఫెక్టివ్‌గా పనిచేయాల్సిన అవసరం ఉంది. అయితే 2014లో వైసీపీ అధికారంలో లేదు కాబట్టి ఇబ్బంది లేదు...ఇప్పుడు అధికారంలో ఉంది..అధికారంలో ఉండి కూడా ఏమి చేయలేదనే అంశం తెరపైకి వస్తుంది. పైగా రాష్ట్ర స్థాయిలో కాస్త వైసీపీ పాలన పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేసే పరిస్తితి ఉంది.
కడప జిల్లా కాబట్టి ఇక్కడ ఏం కాదు అనుకోవడానికి లేదు...ప్రజలు మార్పు కోరుకుంటే ఏదైనా జరగొచ్చు. కాబట్టి వైసీపీ అలెర్ట్‌గా ఉండాల్సి ఉంది. బలం మనకు ఎక్కువ ఉందని అనుకుంటే పొరపాటు అవుతుంది. అలాగే ప్రొద్దుటూరు టీడీపీలో బలమైన నేతలు ఉన్నారు..కాబట్టి వారిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అందుకే వైసీపీ ఇంకాస్త జాగ్రత్తగా ఉంటే ప్రొద్దుటూరులో టీడీపీ ఛాన్స్ రాదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: