బాబు గారు మీరు తొందరగా కోలుకోవాలని : జగన్

praveen
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతుండటంతో ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వస్తుంది అన్న విషయం తెలిసిందే. కేవలం సామాన్య ప్రజలే కాదు సినీ సెలబ్రిటీలు రాజకీయ ప్రముఖులు సైతం వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల టీడీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కరోనా వైరస్ బారిన పడటం తెలుగు తమ్ముళ్లు అందర్నీ కూడా ఆందోళనలో ముంచెత్తింది. చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు నారా లోకేష్ కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు అన్న విషయం తెలిసిందే.దీంతో తమ ప్రియతమ నేత చంద్రబాబునాయుడు త్వరగా కోలుకోవాలి అంటూ ఎంతో మంది టీడీపీ శ్రేణులు పూజలు కూడా చేయడం మొదలుపెట్టారు.

 ప్రస్తుతం చంద్రబాబు నాయుడు వైద్యుల పర్యవేక్షణలో హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అయితే గత కొంత కాలం నుంచి కరోనా వైరస్ నేపథ్యంలో ఎన్నో పర్యటనను వాయిదా వేసుకున్నారు చంద్రబాబు నాయుడు. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చివరికి చంద్రబాబు నాయుడు వైరస్ బారిన పడటం గమనార్హం. ఇదిలా ఉంటే ఇటీవలే ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలంటే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. కరోనా వైరస్ బారి నుంచి చంద్రబాబు త్వరగా కోలుకొని పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ట్విట్టర్ వేదికగా తెలిపారు.

 అయితే ఇటీవలే తాను కరోనా వైరస్ బారిన పడ్డాను అన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. ఇప్పటికే కరోనా వైరస్ కు సంబంధించి స్వల్ప లక్షణాలు ఉన్నాయని ఇక పరీక్షలు చేయించుకో గా పాజిటివ్ వచ్చినట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇక తనను కాంటాక్ట్ అయిన వారు కూడా వెంటనే కరోనా పరీక్షలు  చేయించుకోవాలని హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని చంద్రబాబు నాయుడు ట్విట్టర్  వేదికగా కోరారు . అయితే చంద్రబాబు నాయుడు తనకు పాజిటివ్ వచ్చింది అని చెప్పిన వెంటనే ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా త్వరగా కోలుకోవాలని అంటూ ఆకాంక్షిస్తూ పోస్ట్ పెట్టడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: