పాపం చైనా.. ఆ కంపెనీ మూత పడిందిగా?

praveen
ప్రపంచ దేశాల వినాశనానికి చైనా పుట్టించిన ప్రాణాంతకమైన వైరస్ కరోనా ఇప్పుడు చైనా వినాశనానికి కారణం అవుతుంది అన్నది తెలుస్తుంది. చేసిన పాపానికి ఎప్పటికైనా ప్రాయశ్చిత్తం అనుభవించాల్సిందే అన్నది ఇప్పుడు చైనా విషయంలో నిజం అవుతుంది. మొన్నటి వరకూ రెండు దశలలో కరోనా వైరస్ తో  ప్రపంచ దేశాలు అల్లాడి పోతుంటే చూసి నవ్వుకున్న చైనా ఇక ఇప్పుడు అదే కరోనా వైరస్ తో తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రోజుకి అటు చైనాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ఊహించని సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది.

 ఇప్పటికే గతంలో వచ్చిన వరదల కారణంగా తీవ్రస్థాయిలో కష్టాలను ఎదుర్కొంది చైనా. రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా పడిపోవడంతో చైనా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చైనాకు ఇప్పుడు కరోనా వైరస్ ఊహించని షాక్ ఇస్తోంది. ఇప్పటికే కరోనా వైరస్  కేసులు వెలుగులోకి రావడంతో చైనాలో ఉన్న ఐదు ప్రధాన నగరాలలో లాక్ డౌన్ విధిస్తూ చైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక లాక్ డౌన్ విధించి ప్రజలను ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదు అంటూ ఆంక్షలు విధించింది.

 అయితే ఈ లాక్ డౌన్ నేపథ్యంలో ప్రస్తుతం వాణిజ్య వ్యాపారాలు కూడా మూతపడుతున్న ట్లు తెలుస్తోంది.. దీంతో మరోసారి భారీగా నష్టం వాటిల్లుతుంది అన్నది ప్రస్తుతం బయటికి వస్తున్న నివేదికలు చెబుతున్నాయి. ఇటీవలే చైనాలో వోక్స్ వాగన్ కంపెనీ మూత పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీలో వందలాది మంది ఉద్యోగులు  వైరస్ బారిన పడుతున్న నేపథ్యంలో.. ఇక పూర్తిగా వోక్స్ వాగన్ కార్యకలాపాలని నిలిపి వేయాలి అంటూ చైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ కంపెనీ మూత పడితే చైనాకు ఎంతగానో కష్టాలు వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: