కోవిడ్ ఎఫెక్ట్ : పదండి పోదాం పొలోమని


కోవిడ్-19 తాజా వేరియంట్ ఓమిక్రాన్ తన ప్రతాపాన్ని చూపుతున్న వేళ ప్రపంచ వ్యాప్తంగా ఆంక్షలు పెరుగుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాలు కూడా ఆంక్షలు విధించాయి. తెలుగు రాష్ట్రాలు కూడా నిబంధనలను కఠనతరం చేశాయి. మరికొద్ది రోజుల్లో లాక్ డౌన్ విధించనున్నారనే వార్తలు కూడా హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో వారంతాా భయంతో ఏం చేస్తున్నారో తెలుసా ?
మేడారం.... ఈ పేరుకు పరిచయం అక్కర లేదు. ముఖ్యంగా తెలుగు ప్రజలకు, తెలంగాణ వాసులకు. ఈ  ప్రాంతంలో జరిగే సమ్మక్క సారక్క జాతరకు లక్షలాది మంది విచ్చేస్తారు. ఆసియా ఖండంలోనే అతి పెద్ద  ఇది పురా విశ్వాసాల పండుగ- మేడారం జాతర. ఇక్కడ జరిగే విశేషాలను కవర్ చేసేందుకు విదేశీ పాత్రికేయులు పెద్ద సంఖ్యలో విచ్చేస్తారు. మరో నెల రోజుల్లో ఈ ఆదివాసీ మహా సమ్మేళనం జరగనుంది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం ఫిబ్రవరి 16 నుంచి 19 వ తేదీ వరకూ జాతర జరగ నుంది.
ఓమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. నిన్న మొన్నటి వరకూ బడులకు సంక్రాంతి సెలవులు. వాటి కంటిన్యూయేషన్ గా కోవిడ్ సెలవులు.దీంతో పిల్లలు అందరూ ఇళ్ల వద్దనే ఉన్నారు. పల్లెల్లో  కోవిడ్ ఆంక్షలు తక్కువగా ఉన్నాయి. దీంతో తెలంగాణ వాసులు  నెల రోజుల ముందు నుంచే  మేడారం ఆదివాసీ ప్రాంతానికి తరలి వస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా సందడిగా ఉన్నట్లు జాతీయ మీడియా లో కథనాలు వస్తున్నాయి. మేడారంలో కొలువై యున్న సమ్మక్క సారలమ్మ లను దర్శించుకునేందుకు ఐదు గంటల సమయం పడుతోందంటే ఎంత పెద్ద సంఖ్యలో భక్కులు దర్శనానికి విచ్చేస్తున్నారో  తెలుసుకోవచ్చు. వనదేవతలకు మొక్కులు చెల్లించుకోవడంలో ఆదివాసీ మహిళలు బిజీ బిజీగా ఉన్నారు.  పరిసర ప్రాంతాలలో గుడారాలు వేసుకుని, గుడారాల ముందు మంటలు వేసుకుని భక్కులు చలిని తట్టుకుంటున్నారు. కోవిడ్ నిబంధనలు ప్రస్తుతం అక్కడ అమలులో ఉన్నా కూడా  వాటిని లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో భక్కులు మేడారం తరలి వస్తున్నారు. ముందు ముందు రోజుల్లో కోవిడ్ ఆంక్షలు పెరుగుతాయని, ప్రస్తుతం కొద్ది ఆంక్షలు మాత్రమే ఉన్నందున ఈ సెలవులలోనే వనదేవతల దర్శనం చేసుకుంటే అమ్మవార్లు తమను చల్లంగా చూస్తారని భక్తులు పేర్కోంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: