మోదీ షాకింగ్ నిర్ణయం.. దిగుమతులన్ని రద్దు?

praveen
సరిహద్దులో చైనా సృష్టించిన ఉద్రిక్త పరిస్థితులు చైనాకు ఎంతగా ఉపయోగపడ్డాయో తెలియదు కానీ భారత్కు మాత్రం ఎంతగానో ఉపయోగపడ్డాయి అనే చెప్పాలి. ఎప్పటినుంచో ఇతర దేశాలపై దిగుమతులను నిలిపివేస్తూ దేశీయం గానే అన్ని వస్తువులను తయారు చేసుకోవాలి అనుకుంది. ఇక భారత్ చైనా సరిహద్దు లో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇక దీనిని అమలులోకి తీసుకువచ్చింది. మేకిన్ ఇండియా నినాదం లో భాగంగా భారత్ వస్తువుల దగ్గరనుంచి ఆయుధాల వరకు అన్ని సొంతంగానే తయారు చేసే దిశగా ముందడుగు వేస్తుంది. దీని కోసం కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా వ్యూహాత్మకం గానే వ్యవహరిస్తుంది అని చెప్పాలి.

 ఈ క్రమంలో ఇప్పటికే చైనా నుంచి దిగుమతి చేసుకునే అన్ని రకాల వస్తువులపై కూడా నిషేధం  కొనసాగిస్తుంది. చైనా నుంచి మొన్నటి వరకు దిగుమతి చేసుకున్న అన్ని రకాల వస్తువులను భారత వేదికగానే తయారు చేస్తుంది. ఇప్పుడు ఆయుధాల విషయంలో కూడా మేకిన్ ఇండియా నినాదాన్ని అమలు చేస్తూ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఒకప్పుడు బుల్లెట్ గుండు నుంచి పెద్ద మిస్సైల్ వరకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేది భారత్. కానీ ఇటీవలి కాలంలో ఇతర దేశాలకు సంబంధించిన ఆయుధ తయారీ కంపెనీలను భారత్లోకి ఆహ్వానించి వారితో కలిసి వినూత్నమైన  ఆయుధాలను తయారుచేస్తుంది.

 అదే సమయంలో భారత్ నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు కూడా భారీ రేంజ్లో పెంచింది భారత్. దాదాపు ఇప్పటివరకు 300 మిలియన్ డాలర్ల వరకు ఎగుమతులు చేసింది. కాగా ఇప్పటికే ఆయుధాల దిగుమతులను భారీగానే తగ్గించిన భారత్ ఇక ఇప్పుడు మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. భారత్ కొనుగోలు చేయాలనుకున్నటువంటి మిలిటరీ హెలికాప్టర్లు, షార్ట్ రేంజ్ మిస్సైల్స్ డీల్స్ అన్నిటిని కూడా క్యాన్సర్ చేస్తూ నిర్ణయం తీసుకుంది భారత ప్రభుత్వం. ఇప్పటినుంచి దేశీయంగానే మిలిటరీ హెలికాప్టర్లు షార్ట్ రేంజ్ మిస్సైల్స్ తయారు  చేయడానికి సిద్ధమైంది భారత్. తద్వారా లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆదా  చేయడమే కాదు ఎంతో మందికి ఉపాధి కూడా ఇచ్చినట్లు అవుతుందని.. ఆయుధ తయారీలో మరింత వృద్ధి  సాధిస్తుంది అనే  ఉద్దేశంతోనే భారత్ ఇలాంటి నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: