
ఇదో వింత.. గ్రామానికి బర్త్ డే?
ఈ క్రమంలోనే ప్రతి ఏడాది పుట్టిన రోజు ఎంతో ఘనంగా జరుపుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అందరూ ఫుల్లుగా తాగడం తూలడం డీజే పాటలపై డాన్స్ చేయడం ఇలా చెప్పుకుంటూ పోతే నేటి రోజుల్లో జరుగుతున్న పుట్టినరోజు వేడుకలు గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ఇక్కడ పుట్టిన రోజు ఎంతో ఘనంగా జరిపించారు.. గ్రామస్తులందరూ ఇక ఈ పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నారు. దీంతో అంగ రంగ వైభవంగా ఏకంగా ఒక పండుగలా పుట్టినరోజు వేడుక జరిగింది. అంతా బాగానే ఉంది కానీ అసలు పుట్టినరోజు ఎవరిది అని అనుకుంటున్నారు కదా.
అందరూ జరుపుకునే విధంగా ఇక్కడ జరిగింది మనిషి పుట్టిన రోజు కాదు.. గ్రామానికి పుట్టినరోజు జరిపారు. కులమతాలకు అతీతంగా ఒక పండగ ఉండాలనే ఉద్దేశంతో గ్రామస్తులు ఒక వినూత్నమైన ఆలోచన చేశారు. ప్రతి ఏటా ఊరి పుట్టిన రోజు జరుపుకుంటారు. మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలం లోని లక్ష్మీ నగర్ గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 2016 లో మొదలైన గ్రామ పుట్టినరోజు వేడుకలు ప్రతి సంక్రాంతి రోజున నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఈ సారి 74 వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకునేందుకు ఆ గ్రామం మొత్తం సిద్ధమైపోయింది. ఏకంగా గ్రామంలో ఉన్న పన్నెండు వందల మంది కూడా కులమతాలకు అతీతంగా ఈ పుట్టిన రోజులను ప్రతి ఏటా జరుపుకుంటూ ఉండటం గమనార్హం.